/rtv/media/media_files/2025/11/09/anuapama-2025-11-09-12-05-41.jpg)
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్(anupama-parameshvaran) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫోటోలు(anupama-parameswaran-latest-photos) మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే విచారణలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయేనని తెలిసి తాను షాకయ్యానని తెలిపారు. ఈ విషయం తెలుసుకుని కేరళ సైబర్ క్రైమ్ బ్రాంచ్(Cyber Crime)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు త్వరగా ఆ వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకున్నారు, ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకర కంటెంట్ తో తన ఇమేజ్ ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై, కెరీర్‌పై దుష్ప్రచారం జరుగుతుండటంతో విసిగిపోయిన అనుపమ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Anupama Parameswaran filed a complaint with Kerala Cyber Crime Police against a 20-year-old from Tamil Nadu for spreading fake, inappropriate posts about her and her family#AnupamaParameswaran#KeralaPolicehttps://t.co/XOOxI6TeQN
— News18 (@CNNnews18) November 9, 2025
Also Read : హీరోయిన్పై బాడీ షేమింగ్... క్షమాపణ చెప్పిన యూట్యూబర్ కార్తీక్!
ఇలా వేధింపులు చేయటం చాలా బాధాకరం
సోషల్ మీడియాలో ఇలా వేధింపులు చేయటం చాలా బాధాకరం. నాకు సంబంధించిన ప్రతి పోస్ట్‌పై హానికరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ఉద్దేశ్యంతో.. ఒక వ్యక్తి అనేక ఫేక్ అకౌంట్స్‌ను సృష్టించాడని విచారణలో తేలింది. దీని గురించి తెలుసుకున్న వెంటనే నేను కేరళలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు ఫాస్ట్‌గా స్పందించి ఇలా చేస్తున్న వ్యక్తిని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అది తమిళనాడుకు చెందిన ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తేలింది. ఆమె చిన్న వయస్సును దృష్టిలో ఉంచుకుని.. ఆమె భవిష్యత్తును, మనశ్శాంతి గురించి ఆలోచించి నేను ఆమె వివరాలను వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాను.
ఈ సంఘటనతో ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఇతరులపై వేధించే, పరువు తీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదు అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది. దీనిపైన మేము చట్టపరమైన చర్య తీసుకున్నాము.. వాళ్లు చేసిన చర్యలకు పరిణామాలను ఎదుర్కొంటారు. సైబర్ బెదిరింపు శిక్షార్హమైన నేరం అని తన పోస్టులో అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల నకిలీ ప్రొఫైల్స్, డీప్‌ఫేక్‌ల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో, అనుపమ తీసుకున్న ఈ చట్టపరమైన చర్య ఇతర నటీమణులకు ధైర్యాన్ని ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : ఓటీటీలోకి అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఇప్పుడే చూసేయండి..!
Follow Us