/rtv/media/media_files/2025/11/09/gouri-kishan-2025-11-09-09-25-00.jpg)
నటి గౌరీ కిషన్‌ను ఆమె బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్- జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. అయితేతన ప్రశ్న ఉద్దేశం వేరే విధంగా ఉందని, అది సరదాగా అడిగిందే తప్ప, బాడీ షేమింగ్ చేసేందుకు కాదని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.
I didn't hear any expression of regret in this video. What are you even talking about? https://t.co/v81xeq5wwZ
— Kishore (@kishoreofficial) November 8, 2025
సోషల్ మీడియాలో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశమైన నేపథ్యంలో కార్తీక్ ఒక వీడియో ద్వారా స్పందించారు. "గత కొన్ని రోజులుగా నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. నేను ఒక ఉద్దేశంతో ప్రశ్న అడిగాను, కానీ గౌరీ కిషన్ దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. ఈ ప్రశ్న వలన ఆమె మనసు బాధపడి ఉంటే, దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను" అని కార్తీక్ పేర్కొన్నారు. అయితే తన ప్రశ్నలో ఎలాంటి తప్పు లేదని వాదిస్తూ, హీరో ఆమెను సినిమాలో ఎత్తే సన్నివేశం గురించి సరదాగా అడగాలని మాత్రమే తాను భావించానని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఆలోచన లేదని కార్తీక్ చెప్పారు. ఆమె దానిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
మద్దతుగా చిత్ర పరిశ్రమ
గౌరీ కిషన్‌కు వ్యతిరేకంగా ఈ సంఘటన జరిగిన తరువాత చిత్ర పరిశ్రమ మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది, అలాగే మీడియా వృత్తిపరమైన ప్రమాణాలపై గట్టి డిమాండ్ తీసుకొచ్చింది. దక్షిణాది నటీనటుల సంఘం (ఎస్ఐఏఏ) అధ్యక్షుడు నాజర్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. జర్నలిజం ముసుగులో ఇటువంటి అనైతిక చర్యలను తాము సహించబోమని, మహిళా నటీమణుల పట్ల గౌరవం తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా అబిన్ హరిహరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అదర్స్' చిత్రం నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ఆదిత్య మాధవన్, గౌర్ కిషన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
మరోవైపు తనపై కామెంట్ చేసిన యూట్యూబర్ జర్నలిస్ట్ కార్తీక్ ను లక్ష్యంగా చేసుకోవద్దని గౌరీ కిషన్ అభిమానులను కోరారు. తాను మాట్లాడింది కేవలం తన కోసమే కాదని, బాడీ షేమింగ్, లింగ వివక్షను ఆపడానికి ఈ అంశాన్ని బహిరంగ చర్చకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
Follow Us