Proddatur Dasara Documentary: ఓటీటీలోకి అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఇప్పుడే చూసేయండి..!

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంటే ఇప్పటివరకు ఎంతో మందికి రాయలసీమ ప్రాంతంలోని ఒక ముఖ్య పట్టణంగా మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలోని.. దసరా ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

New Update
Proddatur Dasara Documentary streaming on etv win

Proddatur Dasara Documentary streaming on etv win

Proddatur Dasara Documentary: ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంటే ఇప్పటివరకు ఎంతో మందికి రాయలసీమ ప్రాంతంలోని ఒక ముఖ్య పట్టణంగా మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలోని.. దసరా ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ ఉత్సవాల అసలైన వైభవాన్ని, చరిత్రను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఇటీవల 'ప్రొద్దుటూరు దసరా' అనే ఒక డాక్యుమెంటరీ రూపొందింది. 

Proddatur Dasara Documentary

ఇది అక్టోబర్31న థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ETV విన్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 7 అంటే నిన్నటి నుంచి ఓటీటీలోకి వచ్చింది. 

మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీని ప్రేమ్ కుమార్ వలపల బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మించారు. కాగా ఈ 'ప్రొద్దుటూరు దసరా' డాక్యుమెంటరీకి ప్రారంభం నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలకు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

రాయలసీమ అంటే హింసకు మాత్రమే కాదని.. ఇంతటి ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి కూడా నిలయమని ఈ డాక్యుమెంటరీ రుజువు చేసిందని పలువురు ప్రశంసించారు. 40 నిమిషాలు పాటు సాగే ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వెనుక ఉన్న ఘన చరిత్రను, స్థానికుల భక్తిని, ఉత్సవాల ఏర్పాట్లను మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన విధానం వీక్షకులను కట్టిపడేసింది. త్వరలో బాల్కని ఒరిజినల్ బ్యానర్ పై మరిన్ని చిత్రాలు, డాక్యుమెంటరీలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ చేయగా.. కిలారి సుబ్బారావు PROగా చేశారు.

Advertisment
తాజా కథనాలు