/rtv/media/media_files/2025/10/08/couple-commits-suicide-boyfriend-dies-girlfriend-2025-10-08-09-34-38.jpg)
Couple commits suicide..boyfriend dies..
Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న గడ్డంరాజు అనే యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుని రోజులు గడవక ముందే మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతీ యువకులు అందర్నీ ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ, వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలో నెలకొన్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Rohith Sharma: నా నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థమైంది..కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ స్పందన
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన అంజయ్య-,రేణుక దంపతుల పెద్ద కుమారుడు మారపాక అన్వేశ్(22), హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన గడ్డం దాస్, ఎలీషా దంపతుల కూతురు పావని (20) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్ తన ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే పావని మూడునెలల క్రితం ఇళ్లు వదిలి అన్వేష్‌తో వచ్చేసింది. తల్లి దండ్రులు కూడా ఒప్పుకోవడంతో పావని తల్లిదండ్రుల అనుమతితో అన్వేష్ వాళ్లింట్లోనే ఉంటుంది.కాగా, ఈ విషయమై పావని తల్లిదండ్రులు నెల రోజుల కిందట పంచాయితీ పెట్టారు. తమ కూతురు తీసుకువచ్చాడని ఆరోపించారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని త్వరలోనే వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు.
Also Read : ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి
వీరి పెళ్లికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే అబ్బాయి తరుఫున బంధువులు, కులస్థులు చనిపోతూ రావడం, ఇతర కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంలో వారం రోజులుగా అన్వేష్- పావనిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వారు చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ గడ్డి మందు తాగారు. ఇంట్లో వాళ్లు వచ్చే సమయానికి వారిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఘన్‌పూర్ ప్రభుత్వ వైద్యశాలకు.. అనంతరం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అన్వేశ్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పావని పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. అమ్మాయి తండ్రి దాస్ ఏడాది క్రితం మృతి చెందడంతో తల్లి ఒక్కతే ఉంది. అయితే రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్థల మూలంగా వారు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లిచేసుకుని ఆనందంగా జీవితం సాగించాల్సిన జంట అర్థంతరంగా ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలిచి వేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పిట్ట రాజేష్ వివరించారు.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!