Rohith Sharma: నా నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థమైంది..కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ స్పందన

2027 వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్ గా లేకపోయినా పట్టించుకోనని..జట్టు గెలవడమే తనకు ముఖ్యమని అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్ సవాల్ తో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.  

New Update
rohit

Rohith Sharma

మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యలనకు వెళ్ళనుంది. అక్కడ వన్డే సీరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి భారత జట్టును బీసీసీఐ ఈ మధ్యనే ప్రకటించింది. ఈ జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. అయితే దీని ముందు వరకు వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను ఆ స్థానం నుంచి తప్పించి శుబ్ మన్ గిల్ కు పగ్గాలప్పగించారు. దీనిపై చాలానే చర్చ జరుగుతోంది. 

2027 వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యం..

ఆస్ట్రేలియా వన్డే సీరీస్ కు ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. కఠినమైన టెస్ట్ ను పాస్ అయ్యాడు. దానికి ముందు కూడా సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ భారత జట్టులో ఉంటారా లేదా అనుమానాలు చెలరేగాయి. అయితే ఏ సందర్భంలోనూ రోహిత్ శర్మ స్పందించాలేదు. ఆస్ట్రేలియా టూర్ కు వన్డే జట్టును ప్రకటించిన తర్వాత కూడా హిట్ మ్యాన్ ఏమీ మాట్లాడలేదు. కానీ నిన్న జరిగిన సియట్ అవార్డు ల ఫంక్షన్ లో రోహిత్ శర్మ మొట్టమొదటి సారిగా ఈ విషయంపై స్పందించాడు. తనకు అన్నింటి కంటే క్రికెట్ ఆడడం ముఖ్యమని చెప్పాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగడమే లక్ష్యమని మరోసారి గట్టిగా తెలిపాడు. సీనియర్ క్రికెటర్ గా జట్టుతో కలిపి మంచి ఫలితాలను అందించడంపైనే దఋష్టి పెడతానని అన్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఢీకొనడాన్ని తానెప్పుడూ ఆస్వాదిస్తానని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆ జట్టుతో క్రికెట్ ఆడడం సవాల్ తో కూడుకున్నది..అక్కడ ప్రజలు కూడా ఆటను ఇష్టపడతారు. టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాల మ్యాచ్ జరుగుతుందంటే...అది వేరే లెవల్ ఉంటుంది ఎప్పుడూ. కాబట్టి తమ జట్టు ఏం చేయాలో, తాను ఎలా ఆడాలో ప్రణాళికలు వేసుకుంటున్నానని రోహిత్ చెప్పాడు. కెప్టెన్సీ అనేది తనకు అంత ఇంపార్టెంట్ కాదని ఇండైరెక్ట్ గా తెలిపాడు. టెస్ట్, టీ20 లకు గుడ్ బై చెప్పినా వన్డేల్లో కొనసాగి..తదుపరి వరల్డ్ కప్ ను కొట్టడమే లక్ష్యమని మరోసారి చాలా బలంగా తెలిపాడు హిట్ మ్యాన్.

అన్ని ఫార్మాట్లకు ఒకడే కెప్టెన్...

మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అన్ని ఫార్మాట్లలోనూ ఒకడే కెప్టెన్ ఉండాలన్న ఉద్దేశంతోనే శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ఉంచామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. దాంతో పాటూ 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని కూడా తాము గిల్ కు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఇప్పటి నుంచి అతను కెప్టెన్సీ చేస్తే అప్పటికీ అనుభవం వస్తుందని తెలిపారు. వరల్డ్ కప్ ఆడడానికి రెండు ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నా మధ్యలో భారత జట్టు వన్డేలు ఆడేది ఎక్కువగా లేదని అగార్కర్ స్పష్టం చేశారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను కలిగి ఉంటే చాలా కష్టం. సెలెక్టర్ల పరంగానే కాదు.. కోచ్‌కి కూడా ఇదికష్టమేనని వివరించారు. ముగ్గురు వేర్వేరు వ్యక్తులతో ప్రణాళికలు వేయడం ఎప్పుడూ సులభం కాదని అజిత్ అగార్కర్ తెలిపారు.  

Also Read: H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ప్రయాణాలు వద్దు..కాలిఫోర్నియా యూనివర్శిటీ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు