/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-vintage-photo-shoot.jpg)
ఇందులో 'కన్మణి' పాత్రలో ప్రియాంక నటన, పవన్ తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. సినిమాలో తన ప్రజెన్స్ తక్కువే అయినప్పటికీ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-latest-pics.jpg)
'ఓజీ' సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా బాగానే పెరిగింది. దీంతో ఇటు తెలుగులో, అటు తమిళ్, కన్నడలో మంచి అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది
/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-vintage-look.jpg)
ఈ క్రమంలో తెలుగులో మరో బంపర్ ఆఫర్ పెట్టేసిందట ఈ బ్యూటీ. సుజీత్ - నాని కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రియాంకను హీరోయిన్ గా కాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.
/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-latest-photo-shoot.jpg)
ఇప్పటికే 'గ్యాంగ్ లీడర్', 'సరిపోదా శనివారం' సినిమాల్లో ప్రియాంకతో కలిసి నటించిన నాని.. ఇప్పుడు మరోసారి ఆమె కాంబో రిపీట్ చేయాలని అనుకుంటున్నారట.
/rtv/media/media_files/2025/10/07/nani-priyanka-2025-10-07-16-05-53.jpg)
గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాల్లో ప్రియాంక- నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో నాని.. మరోసారి ప్రియాంకతో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/12/28/priyanka-mohan-photos.jpg)
ఇటీవలే పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన నాని- సుజీత్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
/rtv/media/media_files/2024/11/21/xw6Wz13ZyytErxiLBtLj.jpg)
ఈ సినిమాకు 'బ్లడీ రోమియో' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మాస్ టచ్ ఉన్న ప్రేమ కథగా రూపొందనున్న ఈ చిత్రంలో నాని రోమియో గా, ప్రియాంక జూలియట్ కనిపించబోతుందని టాక్.