/rtv/media/media_files/2025/02/15/u9mbhIohluGynDgOK252.jpg)
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఖరీదైన పోర్షా కయెన్ కారును గిఫ్టుగా ఇచ్చారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పిన బాలయ్య వరుసగా తనకు నాలుగు హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో కారును బహుమతిగా ఇచ్చానని తెలిపారు. సుమారుగా ఈ కారు విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నందమూరి తమన్ గా
కాగా తమన్ , బాలయ్య కాంబోలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అఖండ 2కు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తు్న్నాడు. ఇక తమన్‌ను నందమూరి కాంపౌండ్ ఓన్ చేసుకుంది. స్వయంగా నారా భువనేశ్వరి సైతం ఆయన్ను నందమూరి తమన్ అని సంభోదించిన సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ లో ఇలా కార్లు గిప్ట్ గా ఇవ్వడం అనేది కొత్తేమీ కాదు. గతంలో చాలామంది డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లకు కార్లు గిప్ట్ గా ఇచ్చారు. ఎక్కువగా ఇలాంటి సంప్రాదాయం కోలీవుడ్ లో నడుస్తూ ఉంటుంది.
A bond beyond cinema! ❤️❤️#NandamuriBalakrishna garu gifted a grand Porsche car to our sensational @MusicThaman garu ❤️😍
— manabalayya.com (@manabalayya) February 15, 2025
Their bond keeps growing showing that respect and admiration go beyond movies 🫶🏻 pic.twitter.com/Hp8bk4QxQy
Also Read : రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్
అఖండ 2 విషయానికి వస్తే
‘అఖండ 2 - తాండవం’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనుంది. ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ . శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు ఆధ్యాత్మికత అంశాలతో పోస్టర్ ఆకట్టుకుంటోంది. బాలయ్య తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.