/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Zodiac-Signs-jpg.webp)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు.
Also Read: Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్.. నేపథ్యం ఇదే!
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో ఓ వ్యవహారంలో శుభ ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో మీ మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు అందుకుంటారు. పదిమందిలో మంచిపేరు సంపాదిస్తారు. కోపం అదుపులో ఉంచుకోండి. ఆర్థికంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Also Read: BIG News: మంత్రి పదవులిస్తే విలీనానికి సై.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ప్రయాణాలలో ఆటంకాలు...
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఫలితాలు ఆలస్యం అవడం నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా గడుపుడుతారు. ప్రయాణాలు అనుకూలం.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోపం, పరుష పదాల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మీరు మౌనంగా ఉండండి. వ్యాపారంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ సూచన ఉంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. ఒక సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు.
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని, అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు, విరక్తి, నిరాశ చుట్టుముడతాయి.
మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్నిరంగాల వారు ఈ రోజు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
Also Read: Cinema: ఎట్టకేలకు క్లీంకార ఫేస్ చూపించిన రామ్ చరణ్..ఎంత క్యూట్ గా ఉందో..