/rtv/media/media_files/2025/02/14/trump-modi.jpg)
తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాటే అనేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీరు సుంకాలు విధిస్తే మేమూ విధిస్తామని చెప్పారు. ఇండియాతో సహా ఏ దేశానికీ మినహాయింపు లేదని తేల్చి చెప్పేశారు. కేవలం యూఎస్ లో తయారు చేస్తేనే ఎటువంటి టారీఫ్ లు ఉండవని చెప్పారు. దీంతో ఇప్పుడు సుంకాల భారం భారత్ పై భారీగానే పడనుంది.
మీరెంత అయితే మేమూ అంతే...
ఇప్పటివరకూ కూడా అన్ని దేశాలూ పరస్పరం సుంకాలు విధించుకుంటూనే ఉన్నాయి. అయితే మిగతా దేశాలు వేసే సుంకాల కన్నా అమెరికా వేసేవి తక్కువగా ఉంటూ వస్తున్నాయి. ఇది అగ్రరాజ్యంపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో భారీ వాణిజ్యలోటును అమెరికా ఎదుర్కోంటోంది. ఇదే పరిస్థితి భారత్ తోనూ ఉంది. మన ప్రాడెక్టుల మీద అమెరికా సగటున 3 శాతం సుంక్ విధిస్తుంటే...యూఎస్ ప్రొడక్ట్‌లపై ఇండియా సగటున 17 శాతం వేస్తోంది. ఇది అమెరికా ఆదాయాన్ని తగ్గిస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఈ మొత్తం విధానాన్ని మార్చేయాలని చూస్తున్నారు. కష్టాల్లో అమెరికాను మళ్ళీ అగ్రరాజ్యంగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. దానికోసం అన్ని రకాల ఆర్థిక విధానాలనూ అనుసరిస్తున్నారు. వాటికి సంబంధించిన బిల్లులపై టకటకా సంతకాలు పెట్టేస్తున్నారు. ప్రతీకార సుంకాల విషయంలో భారత్ ను వదిలిపెట్టేదే లేదు...ఇది మోదీ అమెరికాలో అడుగుపెట్టిన రోజు ట్రంప్ చెప్పిన మాట. దాని ప్రకారం భారత్ ఎంత సుంకం విధిస్తే తామూ అంతే విధిస్తామని తెగేసి చెప్పేశారు. అన్ని దేశాలతో ఇదే పద్ధతి పాటిస్తామని అన్నారు.
విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకాలు విధిస్తుంటుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది. అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దుగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషనరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌పై ఎక్కువ టారిఫ్‌లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ట్రంప్ విధానం వల్లన యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌లపై టారిఫ్‌లు తగ్గించాలని ఇండియా చూస్తోంది. అలా అయితే అమెరికా కూడా దిగి వస్తుంది.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం