Hit And Run: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ కలకలం.. ఓ యువకుడు మృతి

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ ఘటనలో అనిల్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. చికిత్స పొందుతూ అనిల్‌ మరణించాడు. ప్రమాదంపై మీర్‌పేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Hit and run

Hit and run Photograph

TG Crime : హైదరాబాద్‌ (Hyderabad) లో విషాదం చోటుచేసుకుంది. మీర్‌పేట్‌లో హిట్ అండ్ రన్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. మీర్‌పేట్‌లో పీఎస్ పరిధిలోని మిథిలా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ అనే యువకుడి తలకు తీవ్ర గాయమైంది.  

చికిత్స పొందుతూ మృతి

జనవరి 1న ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వెంటనే స్పందించి స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనిల్‌ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. అయితే ప్రమాదంపై మీర్‌పేట్‌ పోలీస్ స్టేషస్‌లో ఫిర్యాదు చేసి మూడు రోజులైనా.. పోలీసులు పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఘోరం.. క్యాబ్ డ్రైవర్‌ దారుణ హత్య

 

 

ఇది కూడా చదవండి: యాదాద్రిలో భారీ పేలుడు.. ఒకరి మృతి.. ఇద్దరు పరిస్థితి విషమం

Also Read :  కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు