రోజు రోజుకూ కామాంధులు రెచ్చిపోతున్నారు. అమాయకుల అవసరాలను అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారు. తమ కామ కోరిక తీరిస్తేనే.. పనులు జరుగుతాయని లోబరుచుకుంటున్నారు. ఇక చేసేదేమి లేక బాధితులు లొంగిపోతున్నారు. ఇంట్లో ఉన్న తండ్రి, అన్న దమ్ముల నుంచి విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుల వరకు.. ప్రేమోన్మాదుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల వరకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుండటం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమనే చెప్పాలి. Also Read : ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా అయితే తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి తన కామ కోరిక కోసం దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు కోసం వచ్చిన ఓ మహిళతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. తన కోరిక తీరిస్తేనే.. పని జరుగుతుందని బెదిరించాడు. Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్ ఇక ఆ బాధిత మహిళ చేసేదేమి లేక ఆ పోలీసు ఉన్నాతాధికారి బెదిరింపులకు లొంగిపోయింది. దీంతో ఓ ప్రైవేట్ గదిలోకి ఆమెను తీసుకెళ్లిన ఆ పోలీసు అత్యంత నీచమైన పని చేయించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వ్యవహారం కర్ణాటకలో జరిగింది. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి అసభ్యప్రవర్తనప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన డీవైఎస్పీకర్నాటకలోని మధుగిరి డీవైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు.. ఆమెను ఓ… pic.twitter.com/6YYfzsrRew — Telugu Scribe (@TeluguScribe) January 3, 2025 Also Read: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ కర్నాటకలోని మధుగిరి డీవైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది. అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారమంతా ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వీడియో వైరల్ కావడంతో డీవైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?