Ganesh Chaturthi : గణనాథునికి అపచారం.. మండపాల వద్ద చికెన్ బిర్యానీ భోజనాలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గణేష్ మండపం వద్ద చికెన్ తో భోజనాలు పెట్టడం వివాదస్పదమైంది. అయితే ఇది మండప నిర్వహకులు పెట్టింది కాదు. వైఎస్ వర్థంతి సందర్భంగా గణేష్ మండపాన్ని ఆనుకొని వైసీపీ నాయకులు ఈ భోజనాలు వడ్డించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.