/rtv/media/media_files/2026/01/24/robot-fire-mission-2026-01-24-19-03-50.jpg)
నాంపల్లి అగ్నిప్రమాదంలో ఆరుగురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు 8 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ షాప్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవడంతో పాటు షాప్‍లో పెద్దమొత్తంలో గ్లాస్, రేకులు ఉండటం సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రంగంలోకి రోబో ఫైర్ మిషన్‌ను కూడా దింపారు. హైదరాబాద్‌లో ఫస్ట్ టైం ఈ రోబోలను వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని పరిస్థితిలో ఇవి బిల్డింగ్ లోపలికి వెళ్లి మంటలను ఆర్పుతాయి. నాలుగు అంతస్తులు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‍లో తొలుత మంటలు అంటుకుని నిమిషాల్లోనే భవనం అంతటికి వ్యాపించాయి. భవనంలో ఆరుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. భవనంలో వేగంగా వ్యాపిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ పరిసర ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అధికారులు జేసీబీలు, అత్యాధునిక రోబోలను రంగంలోకి దించారు. భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లను పోలీసులు ఇప్పటికే ఖాళీ చేయించారు.#Nampallypic.twitter.com/d5HHlDsbie
— AIR News Hyderabad (@airnews_hyd) January 24, 2026
ప్రస్తుతం పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృదాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నీకీలలు, దట్టమైన పొగ, కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందకు వీలుకావడం లేదు. దీంతో రోబో ఫైర్ మిషన్‍ను అధికారులు రంగంలోకి దింపారు. ప్రస్తుతం రెస్కూయ ఆపరేషన్ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న సిటీ సీపీ సజ్జనార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయ చర్యలు పరిశీలించారు.
देखिए आग में घुस पानी डालने के लिए चीन ने ऐसा रोबोट बना दिया…
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 21, 2025
अब कोई 15 करोड़ लेकर ये न कह दे कि चीन ये सब कर पा रहा है क्योंकि वहाँ “ लोकतंत्र नहीं है… विपक्षी पार्टियाँ नहीं है” 🤡
pic.twitter.com/r0oexgjB6N
టెక్నాలజీ రంగంలో 'రోబో ఫైర్ మిషన్' అనేది అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి, అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి తయారు చేసిన సిస్టమ్. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రదేశాలకు (ఉదాహరణకు: కెమికల్ ఫ్యాక్టరీలు, ఇరుకైన గల్లీలు, గ్యాస్ లీకేజీ ప్రాంతాలు) వెళ్లి మంటలను ఆర్పే యంత్రాలనే 'ఫైర్ ఫైటింగ్ రోబోలు' అంటారు. వీటిని ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రక్రియనే రోబో ఫైర్ మిషన్ అంటారు.
ముఖ్య లక్షణాలు:
రిమోట్ కంట్రోల్: వీటిని సుమారు 500 నుండి 1000 మీటర్ల దూరం నుండి రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.
థర్మల్ కెమెరాలు: మంటలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో, లోపల ఎవరైనా చిక్కుకున్నారో గుర్తించడానికి వీటికి థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఉంటాయి.
అధిక పీడనం: ఇవి నిమిషానికి వేల లీటర్ల నీటిని లేదా కెమికల్ ఫోమ్‌ను చాలా వేగంగా చిమ్మగలవు.
ఉష్ణ నిరోధకత: ఇవి దాదాపు 1000°C వరకు వేడిని తట్టుకోగల ప్రత్యేక మెటల్ బాడీతో తయారవుతాయి.
ప్రయోజనాలు:
మంటల్లోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రాణాపాయం తక్కువ.
నిరంతర పని: మనుషులు పొగ లేదా వేడి వల్ల అలసిపోతారు, కానీ రోబోలు గంటల తరబడి నిరంతరాయంగా పనిచేయగలవు.
అడ్డంకులను అధిగమించడం: వీటిలో ఉండే 'ట్రాక్డ్ వీల్స్' (ట్యాంక్ లాంటి చక్రాలు) మెట్లు ఎక్కడానికి, శిథిలాల మీద ప్రయాణించడానికి సహాయపడతాయి.
భారతదేశంలో వినియోగం:
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోని ఫైర్ డిపార్ట్‌మెంట్లు ఇప్పటికే ఈ తరహా రోబోలను తమ అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. ముఖ్యంగా ఇరుకైన సందుల్లో మంటలను ఆర్పడానికి ఇవి ఎంతో కీలకంగా మారాయి.
Follow Us