/rtv/media/media_files/2026/01/25/padma-shri-awards-2026-01-25-15-37-41.jpg)
2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 13 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో సినిమా, వైద్యం, సైన్స్, కళా రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
పద్మ భూషణ్
వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ - క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్(UGC మాజీ ఛైర్మన్)ను ఢిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారం వరించింది.
పద్మశ్రీ గ్రహీతలు
ఆంధ్రప్రదేశ్ (4 మంది)
గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్: కళలు (ప్రముఖ నటుడు 'నటకిరీటి').
మాగంటి మురళీ మోహన్: కళలు (ప్రముఖ నటుడు, నిర్మాత).
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం): కళలు (అన్నమాచార్య కీర్తనల వాగ్గేయకారుడు).
వెంపటి కుటుంబ శాస్త్రి: సాహిత్యం మరియు విద్య.
తెలంగాణ (7 మంది)
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్ & ఇంజినీరింగ్): హైదరాబాద్‌లోని CCMB శాస్త్రవేత్తగా ఆయన మానవ పరిణామ క్రమం, పురాతన డీఎన్ఏ, జన్యుపరమైన వ్యాధులపై మూడు దశాబ్దాలుగా విశేష పరిశోధనలు చేశారు. ముఖ్యంగా అండమాన్ ఆదివాసీల మూలాలను కనుగొనడంలో ఆయన చేసిన కృషి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
రామారెడ్డి మామిడి (వ్యవసాయం): పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగంలో ఆయన చేసిన విప్లవాత్మక మార్పులకు గాను ఈ పురస్కారం దక్కింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతో విలువైనది..
దీపికా రెడ్డి: కళలు (కూచిపూడి నృత్యం).
డాక్టర్ గూడూరు వెంకట్ రావు: వైద్యం (ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్).
డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి: వైద్యం (క్యాన్సర్ నిపుణులు).
చంద్రమౌళి గడ్డమనుగు: సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్: సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
దేశవ్యాప్తంగా ఎంపికైన ప్రముఖులు
కర్ణాటకకు చెందిన అంకెగౌడ (పుస్తక ప్రేమికుడు), తమిళనాడుకు చెందిన నటేశన్, తిరువయ్యూర్ భక్తవత్సలం, పర్యావరణ వేత్త దేవకి అమ్మాజీ వంటి సామాన్యులను వారి అసాధారణ సేవల కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. సాహిత్యం, కళలు, సామాజిక సేవ, మరియు వైద్య రంగాల్లో అంకితభావంతో పనిచేస్తున్న హాలీ వార్, ఖేమ్ రాజ్, శ్రీరంగ్ దేవబాలద్ వంటి 45 మంది ఈ జాబితాలో ఉన్నారు.
ప్రచారానికి దూరంగా ఉంటూ సమాజ హితం కోరే వ్యక్తులకు ఈ అవార్డులు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అవార్డులను త్వరలోనే రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు.
Follow Us