Telangana : రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో నాలుగురోజులు వానలే.. వానలు!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.