Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ?
ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్నారు.
TG: బీజేపీపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు పార్టీ ఏర్పాటు చేసిన బృందానికి సారథ్యం అప్పగించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు సమాచారం. అందుకే ఈరోజు వరద ప్రభావిత ప్రాంత పర్యటనకు ఆయన వెళ్లలేదని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
TG: రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని హరీష్ రావు అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 అత్యాచారాలు జరిగాయని చెప్పారు. HYD బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.
TG: కొమరం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జైనూరులో గిరిజనురాలిపై అత్యాచారం ఘటనపై ఆదివాసీలకు, మరో వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు అక్కడ 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.
ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీయడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు