ఘోర ప్రమాదం.. నలుగురు మృ‌తి

ఆదిలాబాద్ జిల్లా మేకలగండి జాతీయ రహదారిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాలు ఉందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
accident

ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మ‌ృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మోయిజ్, అలీ, ఖాజా మోయినుద్దీన్, మొహమ్మద్ ఉస్మానుద్దీన్ అక్కడిక్కడే మరణించారు. మేకలగండి నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాల సమయం ఉండగా ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చూడండి:  Rajinikanth:ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్ !

Advertisment
తాజా కథనాలు