/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
Road Accident
Road Accident: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
కాగా ట్రావెల్స్ బస్సు నార్కట్‌పల్లి వైపు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మేడ్చల్ ప్రాంతానికి చెందిన రామప్రభు (61), అనఘ (25) ఉన్నారు. వారితో పాటు మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని నార్కట్‌పల్లి శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us