BIG BREAKING : సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్ సెషన్లో గాయం అయినట్లు తెలిపారు. కాగా త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు.ఈ విషయమై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రియాంక చోప్రాకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.హాలీవుడ్ సినిమా బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు మెడకు గాయాలు అయినట్లు సమాచారం.గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక ఇన్ స్టా ద్వారా తెలిపింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరిక్రుష్ణ పేరుతో ఉంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యల గూడెం పులివాగు శివాలయం వద్ద ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఒకటి లారీని ఢీ కొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం నుంచి వాడపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికుులు ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్(హెచ్ ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.