/rtv/media/media_files/2025/04/26/CZjVtGgZUidi7myo1iZS.jpg)
Kaleshwaram ENC Hariram
Big Breaking : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల సమయంలో దెబ్బతింది. దీనిపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దానికోసం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురిని విచారించి కమిషన్ మరికొంతమంది విచారణకు సిద్ధమైంది. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఇవాళ తెల్లవారుజాము నుంచి సోదాలు సాగుతున్నాయి.
Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించినట్లు అధికారులు గుర్తించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల మూలంగానే కుంగిపోయిందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాగా గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్‌ను ఈ కేసులో భాగంగా విచారించింది.ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.
Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను ఇప్పటికే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డామేజ్‌కు బాధ్యులెవరంటూ చంద్రఘోష్ కమిషన్.. హరిరామ్‌ను ప్రశ్నించగా గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం అందుకు ప్రధాన కారణమని తెలిపారు. 2017లో నాటి ఉన్నత స్థాయి కమిటీ అంశాలను కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఫాలో కాలేదని హరిరామ్ కమిషన్ ఎదుట స్పష్టం చేశారు. కాగా ఇప్పుడు ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.
Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్..10 మంది సైనికులు హతం!