New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ షురూ అయింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, రిటైల్ స్టోర్‌ల నుండి కొనుక్కోవచ్చు. 8GB/128GB వేరియంట్ ధర రూ.27,999, 8/256GB వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఫస్ట్ సేల్ కింద రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.

New Update
Samsung Galaxy M56 5G

Samsung Galaxy M56 5G

Samsung Galaxy M56 5G ఫోన్‌ ఏప్రిల్ 17న భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పుడు సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో ఎక్సినోస్ చిప్‌సెట్ అందించారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ ఉంది. ఇది 5000mAh బ్యాటరీతో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ సేల్ ఆఫర్ కింద భారీ ఆఫర్లను కలిగి ఉంది. 

Samsung Galaxy M56 5G Offers

భారతదేశంలో Samsung Galaxy M56 5G సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇతర రిటైల్ షాప్‌లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy M56 5G రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. అందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.27,999.. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 30,999గా కంపెనీ నిర్ణయించింది. ఫస్ట్ సేల్ కింద ఫోన్‌పై రూ. 3000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ తగ్గింపు తర్వాత వరుసగా రూ.24,999, రూ.27,999కు సొంతం అవుతుంది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Samsung Galaxy M56 5G Specifications

Samsung Galaxy M56 5G ఫోన్ 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి FHD+ రిజల్యూషన్ ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చబడి ఉంది. 1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో ప్రకాశవంతమైన స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో Exynos 1480 చిప్‌సెట్ అందించారు. దీనితో పాటు కంపెనీ ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అందించింది. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది. దీనిలో ప్రధాన లెన్స్ 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 స్కిన్‌తో వస్తుంది. 

tech-news | telugu tech news | tech-news-telugu | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు