/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే.కానీ అవి ఎప్పుడూ ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు.కాగా..పాక్ ఏర్పడింది.1947 లో అని కూడా ట్రంప్ కు తెలీదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి విమర్శిస్తున్నారు.
Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
ఇదిలా ఉంటే..జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్ సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారని జైస్వాల్ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్ లో రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.
మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
Also Read:AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!
Also Read: Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి
trump | kashmir | Jammu and Kashmir | india | latest-news | telugu-news