/rtv/media/media_files/2025/10/26/cm-revanth-2025-10-26-21-15-13.jpg)
Telangana Higher Education Institutes Federation Warns Congress Govt Over Fee Reimbursement Arrears
రేవంత్ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని తేల్చిచెప్పాయి. రూ.900 కోట్ల బకాయిలు చెల్లించాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ చైర్మన్ ఎన్ రమేశ్ డిమాండ్ చేశారు. రూ.1200 కోట్లకు గాను ఇప్పటిదాకా రూ.300 కోట్లే ఇచ్చారని.. నవంబర్ ఒకటో తేది నాటికి మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాలన్నారు.
Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
ఫీజు బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు నడపడం కష్టమని.. మంత్రలు కూడా తమకు సహకరించడం లేదని ఆరోపణలు చేశారు. బకాయిలు అడిగితే మాపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఇటీవల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: మెట్రో స్టేషన్‌లో కండోమ్ ప్యాకెట్లు.. షాకైపోయిన ప్రయాణికులు
గతంలో కూడా చాలాసార్లు బకాయిలు చెల్లించకపోతే బంద్‌కు వెళ్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హెచ్చరించాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు ఉండగా.. దీపావళిలోగా వాటిని చెల్లిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Follow Us