Crime: బోధన్ హాస్టల్ లో దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపిన జూనియర్లు!
నిజమాబాద్ జిల్లా బోధన్‌లోని బీసీ హాస్టల్ లో దారుణం జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వెంకట్ అనే విద్యార్థిని ఆరుగురు ఇంటర్ స్టూడెంట్స్ కొట్టి చంపారు. జిరాక్స్ విషయంలో గొడవ జరిగినట్లు హాస్టల్ వార్డెన్, తోటి విద్యార్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.