/rtv/media/media_files/2025/08/30/a-family-immersed-gold-chain-with-ganesha-idol-by-mistakely-in-ranga-reddy-district-2025-08-30-21-51-07.jpg)
దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో ఐదు తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. హస్తినాపురంలో ఓ ఫ్యామిలీ ఇంట్లో గణేశుడిని పెట్టుకున్నారు.
Also Read: ప్రజల విశ్వాసంతోనే వరదలు.. కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మూడు రోజుల పాటు పూజలు చేశారు. ఆ విగ్రహానికి ఈ మూడు రోజులు మెడలో 5 తులాల బంగారు గొలుసు వేసి ఉంచారు. దేవుడి దగ్గర పెట్టిన బంగారాన్ని తిరిగి ధరిస్తే మంచి జరుగుతుందని కొందరు నమ్ముతుంటారు. ఈ కారణం వల్లే ఆ కుటుంబం కూడా ఈ పద్ధతిని ఫాలో అయ్యింది. చివరికి పూజలు పూర్తయ్యాక శనివారం ఉదయం వినాయకుని నిమజ్జనం చేసేందుకు మాసాబ్ చెరువుకు బయలుదేరారు. అక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే కొంతసేపటికి ఆ ఇంటి మహిళకు వినాయకుడి మెడలో వేసిన బంగారు చైన్ గుర్తొచ్చింది.
Also Read: ఆర్సీబీ సంచలన నిర్ణయం..వారికి రూ.25 లక్షల ఆర్థికసాయం
చివరికి తన గొల్డ్ చైన్ వినాయకుడితో పాటు నీటిలోకి వెళ్లినట్లు అక్కడున్న మున్సిపల్ సిబ్బందికి చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది JCB సాయంతో వినాయకులను చెరువు నుంచి బయటకు తీశారు. చివరికి వాళ్ల వినాయకుడి మెడలో బంగారు గొలుసు అలాగే ఉంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ సిబ్బందికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడున్న వాళ్లు కూడా వారిని ప్రశంసించారు.
Also Read: భూమిలాంటి మరో గ్రహం గుర్తింపు.. జీవం ఉండే ఛాన్స్ ఉందంటున్న శాస్త్రవేత్తలు