Kamareddy : ప్రజల అతి విశ్వాసంతోనే వరదలు.. కామారెడ్డి ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్‌ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల అతి విశ్వాసంతోనే వరదల్లో చిక్కుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Kamareddy MLA

Kamareddy MLA

Kamareddy : తెలంగాణలో వరుస గా కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్‌ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల అతి విశ్వాసంతోనే వరదల్లో చిక్కుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నాయకులు ఏమీ చేయలేరని.. ప్రజలే అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. వర్షాలు పడుతున్న సమయంలో వరదలు తక్కువగా ఉన్నప్పుడే జనం భయటకు వచ్చి ఉంటే బాగుండేదని వెంకటరమణరెడ్డి అన్నారు.

Also Read: వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం

ప్రజాతప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. ఆక్రమణలు కూడా దీనికి కారణమేనని వ్యాఖ్యానించారు. అధికారులు, ఎమ్మెల్యే కనబడటం లేదని.. ఎవరెవరో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఓటు వేసినందుకు వారి ముడ్డి కడగాలంటే కుదరదని ఘాటుగా స్పిందించారు. వరదల సమయంలో కామారెడ్డిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించానన్నారు.. అలాగని ఫొటోలకు పోజులు ఇవ్వలేదని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తెలిపారు. 

Also Read : మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!

కామారెడ్డిలో మూడు గంటల్లోనే కుండపోత వర్షం కురిసిందని, జల విలయం సంభవించిందని చెప్పారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుపక్కల చెరువులు అలుగు పారాయని, కట్టలు తెగిపోయాయని అన్నారు. ఊహించని నష్టం వాటిల్లిందని తెలిపారు. వర్షాల్లో అధికారులతో కష్టపడి పనిచేశానని చెప్పుకున్నారు. అయినప్పటికీ కొంతమంది సోషల్‌మీడియాలో ఘోరమైన కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలే తప్ప.. ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టడం సరికాదని ఎమ్మెల్యే హితవు పలికారు. వరదల్లో నేను ఏం చేశానో ప్రజలకు, బాధితులకు తెలుసని వ్యాఖ్యానించారు.

Also Read:Maldives Vacation: మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్ .. ఫొటోలు చూశారా!

Advertisment
తాజా కథనాలు