RCB Compensation: ఆర్సీబీ సంచలన నిర్ణయం..వారికి రూ.25 లక్షల ఆర్థికసాయం

18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ట్రోఫీని నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్‌ విజయోత్సవాలు విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో  తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. కాగా వారికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా ఆర్సీబీ ప్రకటించింది.

New Update
Overcrowding, free passes among causes of RCB celebration stampede, sources

Overcrowding, free passes among causes of RCB celebration stampede, sources

RCB Compensation:18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ట్రోఫీని నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్‌ విజయోత్సవాలు విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించుకోవాలనుకున్న ఆర్సీబీకి ఆ సంతోషం ఎక్కువ సమయం మిగలలేదు. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో  తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.  ఈ ఘటన అటు కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలకు దారి తీసింది.

 కాగా ప్రమాదం జరిగిన సమయంలోనే  ఆర్సీబీ రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించాయి. అయితే తమ అభిమానులకు అండగా ఉండేందుకు గాను ఫ్రాంచైజీ ‘ఆర్సీబీ కేర్స్‌’ ను ప్రారంభించింది.   అందులో భాగంగా నాడు బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఆర్థికసాయాన్ని రూ.25 లక్షలకు పెంచుతూ ఓ ప్రకటన జారీ చేసింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా అందజేనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కేర్స్ ను ప్రారంభించింది. తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ RCB కేర్స్ పేరుతో ఒక మంచి పనిని ప్రారంభించినట్లు తెలిపింది. 'జూన్ 4, 2025న మా హృదయాలు ముక్కలయ్యాయి. RCB కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులను కోల్పోవాల్సి వచ్చింది. వారు ఎప్పటికీ ఆర్సీబీ ఫ్యామిలీలో భాగం. ఇది మన నగరం (బెంగళూరు), మన సొసైటీ.  తొక్కిసలాటలో మృతి చెందిన వారి జ్ఞాపకాలు మన హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి' అని ఆర్సీబీ పెట్టిన పోస్ట్ లో పేర్కొంది.

బెంగళూరు జట్టు గౌరవంలో వారంతా భాగం. ఇప్పుడు వారు లేకపోవడం ఎంతో బాధాకరం. కానీ, వారి జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. అయితే, ఎంత డబ్బు ఇచ్చినా వారు లేని లోటును తీర్చలేం. అయితే, ఆర్థికంగా ఆ కుటుంబాలకు కాస్త మద్దతుగా ఉండాలని నిర్ణయించాం. అందులోభాగంగా బాధిత ఫ్యామిలీకి రూ.25 లక్షలు చొప్పున అందజేస్తాం. కేవలం ఆర్థికంగానే కాకుండా.. వారి కుటుంబాలకు ఎలాంటి అవసరమైనా మద్దతుగా నిలుస్తాం. ఇది ఆర్సీబీ కేర్స్‌ ఆరంభం. భవిష్యత్తులోనూ వారి గౌరవానికి భంగం కలిగించకుండా చర్యలు తీసుకుంటాం. అభిమానుల ఆకాంక్ష మేరకు ప్రతి అడుగు వేస్తాం’’ అని ఆర్సీబీ వెల్లడించింది. 

Also Read : విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు