/rtv/media/media_files/2025/08/30/earth-2025-08-30-20-06-58.jpg)
NASA’s James Webb telescope spots possible alien life on K2-18b planet
Alien Life: ఈ విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా అనేదానిపై పరిశోధనలు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటకీ పలువురు శాస్త్రవేత్తలు ఈ అనంత విశ్వంలోనే ఎక్కడైనా మరోచోట జీవం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలకు ఓ కీలక సమాచారం లభించింది.
Also Read: వివాదంలో ఇరుక్కున్న మెటా.. సెలబ్రిటీల అసభ్యకరమైన ఫొటోలపై విమర్శలు
భూమికి సుదూర ప్రాంతంలో విశ్వాన్ని అధ్యయనం చేస్తున్న జేమ్స్‌వెబ్ టెలీస్కోప్ కీలక సమాచారం ఇచ్చింది. సూర్యుడికి 124 లైట్ ఇయర్స్ దూరంలో కే218 అనే గ్రహాంలో శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ సాయంతో వాతావరణాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ గ్రహంలో డైమెథైల్ సల్ఫైడ్(DMS) , డైసల్ఫైడ్(DMDS) అనే రసాయనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కెమికల్స్ ప్రస్తుతం భూమిపై ఉన్న జీవుల వల్లే ఉత్పత్తి అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అల్గే వంటి సూక్ష్మజీవుల వల్ల ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ గ్యాస్‌లు ఆ గ్రహంపై జీవం ఉందనేది చెప్పడానికి ఆధారం కాకపోయినా.. దీన్ని ఓ బలమైన సంకేతంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
The James Webb Telescope and the Search for Life on K2-18b
— Black Hole (@konstructivizm) February 10, 2025
The James Webb Space Telescope is currently studying the exoplanet K2-18b, which scientists believe may harbor conditions suitable for life.
This hypothesis arises from the detection of dimethyl sulfide (DMS) in the… pic.twitter.com/XP7ZjgmcZO
Also Read: అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హ్యూమనాయిడ్ రోబో.. అచ్చం మనిషిలానే
దీనిపై కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ స్పందిస్తూ ఆ గ్రహంపై జీవం ఉందన్న భావనకు ఇది బలమైన సంకేతమని అన్నారు. అంతేకాదు ఆ గ్రహంపై ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లు భూమి కంటే వేల రేట్లలో కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు. కే218బీ గ్రహం భూమికన్నా 2.5 పెద్దగా ఉందన్నారు. అంతేకాదు ఇది జలరూపం ఉండటానికి అవకాశం ఉన్న జోన్‌లో పరిభ్రమిస్తోందని అన్నారు. అక్కడ నీరు కూడా ఉండే ఛాన్స్ ఉందని, జీవం ఏర్పడేందుకు అది కూడా ఓ మౌలిక సదుపాయాల్లో ఒకటని పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ మిస్సింగ్ ?.. ఎక్స్‌లో 'ట్రంప్ ఇజ్ డెడ్' అని ట్రెండింగ్
మరోవైపు జేమ్స్‌వెబ్ టెలీస్కోప్ సేకరించిన డేటాను మరికొన్ని టీమ్‌లు మళ్లీ పరిశీలించాయి. అయితే ఆ గ్రహంపై ఆ గ్యాస్‌ల ఉనికిపై క్లారిటీ తక్కువగానే ఉందన్నారు. ఇది పరిశోధనలో ఒక అడుగు మాత్రమేనని.. పూర్తి ఆధారమని చెప్పలేమని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన డా. డేవిడ్ క్లెమెంట్స్ అన్నారు. ఆ గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి సైంటిస్టులు 'ఫైవ్ సిగ్మా థ్రెషోల్డ్' అని పిలవబడే 99.99994 శాతం విశ్వాసం సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ఏ ఆధారాలు పూర్తిగా నిర్ధారించబడి ఉన్నాయో చెప్పలేమన్నారు.
ఇదిలాఉండగా జేమ్స్‌వెబ్ టెలిస్కీప్ ఆ గ్రహంపై మరిన్ని పరిశోధనలు చేపట్టనుందని మధుసూదన్ తెలిపారు. మరికొన్నిరోజుల్లో మరో సెట్ డేటా కూడా అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. రాబోయే ఒకటి, రెండేళ్లలో కచ్చితంగా సంకేతాలతో అక్కడ జీవం ఉందా ? లేదా ? అని నిర్ధారించవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.