/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Death
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అశ్విని కి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
Also Read: పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి వీడే .. లష్కరే తోయిబా టాప్ కమాండర్!
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివాడు. రిజల్ట్స్ చూసుకోగా ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు సమీపంలో అవంతినగర్‌కు చెందిన ఓ విద్యార్థి బల్కంపేటలోని ఇంటర్ ఫస్టియర్ చదివాడు.
Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురయ్యాడు. సాయంత్రం ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నాగోలు తట్టిఅన్నారం వైఎస్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యింది. ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉరేసుకొని సూసైట్ చేసుకుంది.
Also Read: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్.. నేడు జేడీ వాన్స్!
బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న సుమతి, రామకృష్ణ కూతురు నిష్ఠ.. ఇంటర్ ఫస్టియర్ చదవింది. అయితే కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదివింది. సెకండియర్‌లో అనుకున్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంది.
Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!
telugu-news | rtv-news | national-news | inter-results | suicide