/rtv/media/media_files/2025/04/23/ZhrwurBS0gMUcpmKhKae.jpg)
terror attack in j and k
పహల్గాం దాడికి ఇండియన్ ఆర్మీ ప్రతీకారం మొదలుపెట్టింది. ఉరీ సెక్టార్ గుండా చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదుల యత్నించగా వారిని భారత ఆర్మీ అడ్డుకుంది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీ సంఖ్యలో IED బాంబులు, AK రైఫిల్స్, పిస్టల్ స్వాధీనం చేసుకుంది. కుల్గాంలోనూ ఆర్మీ వేట కొనసాగుతుంది. భద్రతా బలగాల అదుపులో 1500 మంది అనుమానితులు ఉన్నారు.
Also read : AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!
జమ్మూకశ్మీర్ లో భయాందోళనలు
పహల్‌గామ్ ఘటనతో జమ్మూకశ్మీర్ లో మరోసారి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఘటనతో పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉగ్రవాదుల కాల్పులతో అక్కడ ఉన్న టూరిస్టులు తమ సొంతూరుకు పయనం అవుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా నిండిపోయింది. ప్రయాణికుల దృష్ట్యా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లుగా వెల్లడించింది.
మరోవైపు పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ సర్కార్ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. కాగా ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 28 మంది చనిపోగా, అందులో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లుగా సమాచారం.
Also Read : Telangana: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?
Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!