Maoist Party: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.

New Update
Maoists

Maoists

మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. వీళ్లు సాంబయ్య అలియాస్ ఆజాద్‌, నారాయణ అలియాస్‌ రమేశ్‌, సోమ్‌దా అలియాస్‌ ఎర్ర అని తెలిపారు. ఇక మిగతా 34 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాళ్లని పేర్కొన్నారు. వీళ్లలో ముగ్గురు డివిజినల్ కమిటీ మెంబర్స్‌, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌(Revanth Reddy) పిలుపు మేరకు వీళ్లందరూ జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. తమకు సరెండర్ అయినవాళ్లందరూ కూడా వారి ఆయుధాలు అప్పగించారని తెలిపారు.37 మందికి కూడా తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్లు పేర్కొన్నారు. ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాస్‌ నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉందని తెలిపారు. 

Also Read: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహితకు బిగ్ షాక్‌.. అవార్డు తీసుకుంటే నేరమే

37 Maoists Surrender

ఈరోజు లొంగిపోయిన 37 మంది మావోయిస్టులపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉందన్నారు. ఈ మొత్తం కూడా వాళ్లకే అందజేస్తామని తెలిపారు. అంతేకాదు వీళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లకి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని పేర్కొన్నారు. మిగతా మావోయిస్టులకు పోలీసులకు తొందరగా లొంగిపోవాలని కోరుతున్నామని అన్నారు. ఇంకా తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని పేర్కొన్నారు.  

ఇందులో అయిదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్‌ గణేశ్‌, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఉన్నట్లు తెలిపారు. అలాగే 10 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీళ్లందరూ త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నామని చెప్పారు. ఇదిలాఉండగా గత కొంతకాలంగా మావోయిస్టులు వరుసగా లొంగిపోతూ వస్తున్నారు. 

Also Read: రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్.. పేలుళ్ల కేసులో సంచలన నిజాలు

వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరవేతపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత కొంతకాలంగా దశల వారిగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు