/rtv/media/media_files/2025/11/22/delhi-case-2025-11-22-14-42-47.jpg)
Terror Doctor's Big Confession, New Revelations In Delhi Blast Conspiracy
ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లోనే బాంబు దాడులకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలిందని పలు జాతీయ మీడియాలు కథనాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్‌ను ఉమర్ నబీగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అతడితో సంబంధాలు ఉన్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులోనే సంచలన విషయాలు బయటికొచ్చాయి. రెండేళ్ల నుంచే దేశవ్యాప్తంగా దాడుల కోసం సిద్ధం అవుతున్నామని అనుమానితుల్లో ఒకడైన డా.ముజమ్మిల్ షకీల్ NIA దర్యాప్తులో అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read: భారతీయులలో పెరుగుతున్న ఊబకాయం..అంతా ఫుడ్ డెలివరీ వల్లనే..
ఇందుకోసం బాంబు పేలుడు పదార్థాలు, రిమోట్లు సేకరిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. తనకు యూరియా, అమ్మోనియా నైట్రేట్‌ను కొనుగోలు చేసే బాధ్యత అప్పగించినట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్, నూహ్ నుంచి రూ.3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాద్‌లో కొన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఫెర్టిలైజర్‌ను పేలుడు పదార్థాల్లో వాడేలా చేయడం, ఇతర రసాయలనాలను సేకరించడం ఉమర్ నబీ పని అని తెలిపాయి.
ఢిల్లీ పేలుళ్ల కుట్రకు విచారలో ఉన్న ఈ ఉగ్ర అనుమానితులే నిధులు సమకూర్చినట్లు వెల్లడించాయి. మొత్తం నిధులు రూ.26 లక్షలు రాగా.. వీటిని ఉమర్ నబీకి ఇచ్చారని, అతడు కూడా సొంతంగా రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలిపాయి. అంతేకాదు అల్‌ఫలా యూనివర్సిటీలో డబ్బు విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య గొడవ కూడా జరిగిందని.. ఆ తర్వాత రెడ్ ఎకోస్పోర్ట్ కారును ముజమ్మిల్ ఉమర్‌కు ఇచ్చాడని పేర్కొన్నాయి. రూ.6.5 లక్షలతో ఏకే 47 రైఫిల్‌ను కూడా కొన్నట్లు ముజమ్మిల్ ఒప్పుకున్నాడు. తన హ్యాండ్లర్ పేరు మన్సూర్ అని.. ఉమర్ హ్యాండ్లర్ పేరు హషీమ్ అని చెప్పాడు. వీళ్లిద్దరూ ఇబ్రహీం అనే మరో వ్యక్తి కూడా చెప్పినట్లు పనిచేస్తారని ముజమ్మిల్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు..కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం
అంతేకాదు ముజమ్మిల్, అదీల్, ముజఫర్ ఈ ముగ్గురూ కూడా ఉకాసా ఆదేశాల మేరకు తుర్కియేకు వెళ్లారు. అయితే ఉకాసాకు తేహ్రీకీ ఈ తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలు ఉన్నాయి. టెలిగ్రామ్‌లో ముజమ్మిల్, ఉకాసా సంభాషించుకునేవారని విచారణలో తేలింది. మొత్తంగా వీళ్లందరూ కలిసి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది. ఇదిలాఉండగా ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
Follow Us