Nobel Peace Prize: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహితకు బిగ్ షాక్‌.. అవార్డు తీసుకుంటే నేరమే

ఈ ఏడాది  వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమె ఈ బహుమతి తీసుకునేందుకు  వెనెజువెలా దాటి వెళ్తే.. పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటర్నీ జనరల్‌ ప్రకటించారు.

New Update
Maria Corina Machado

Maria Corina Machado

ఈ ఏడాది  వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado) నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) అందుకున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా ఈ నోబెల్ బహుమతి తీసుకుంటుందా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆమె ఈ బహుమతి తీసుకునేందుకు  వెనెజువెలా దాటి వెళ్తే.. పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటర్నీ జనరల్‌ ప్రకటించారు. 

Also Read: రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్.. పేలుళ్ల కేసులో సంచలన నిజాలు

Venezuelan Nobel Peace Prize Winner To Be Declared 'Fugitive'

మరియాపై ఇప్పటికే విద్వేషాన్ని ప్రేరేపించడ, ఉగ్రవాదం, కుట్రలు లాంటి పలు కేసులు ఎదుర్కొంటోందని అందుకే ఈ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరేబియన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న సముద్రాలపై అమెరికా సైనికులను మోహరించేందుకు మరియా సపోర్ట్ చేసిందని తెలిపారు. దీనిపై ప్రస్తుతం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆమె దేశం దాటి వెళ్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె వచ్చే నెలలో జరగనున్న నోబెల్‌ పురస్కార కార్యక్రమానికి వెళ్లకపోవచ్చని ప్రచారం నడుస్తోంది. 

ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తమ దేశానికి వెనెజువెలా ముఠాల నుంచి మాదకద్రవ్యాలు వస్తున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్‌ ముఠాలతో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు కూడా లింక్స్ ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే ఆ ముఠాలు లేకుండా చేసేందుకు తమ సైన్యాన్ని బరిలోకి దింపారు. అమెరికా చేపట్టిన ఈ చర్యలకు మరియా సపోర్ట్ ఇచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఈ మేరకు తాజాగా ఆమె నోబెల్ బహుమతి తీసుకుంటే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. 

Also Read: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక..వారంలోగా ఒప్పుకోవాలని జెలెన్ స్కీపై ఒత్తిడి

మరోవైపు వెనెజువెలా ప్రజల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాడినందుకు మరియా కొరీనాకు నార్వే కమిటీ నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ దేశంలో నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతిమార్గంలో నడిపించేందుకు ఆమె ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. ఆమె పోరాటంలో ఎన్నో బెదిరింపులు ఎదురేకొన్నారు. ఏడాది కాలం నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు కూడా ఆమె ఎక్స్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. వెనెజువెలా ప్రజలకు, అలాగే తమ పోరాటానికి సపోర్ట్ చేస్తున్న ట్రంప్‌కు ఈ అవార్డు అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు