/rtv/media/media_files/2025/10/09/scam-2025-10-09-21-23-49.jpg)
Scam
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం(fraud) చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. చెవిరెడ్డి పీఏ నుంచి రూ.2 వేల కోట్లు వస్తున్నాయని.. కంటైనర్లు కొనాలని కొందరి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. అలాగే మరికొందరికి బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు గుంజినట్లు వాపోయారు.
Also Read: హైకోర్టు స్టే.. ఎన్నికలకు రేవంత్ సర్కార్ ముందు 3 ఆప్షన్లు
18 Crore Fraud Of YCP Leader
తమ నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత సికింద్రాబాద్ పరిధిలోని వారసిగూడ నుంచి సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరుకు మకాం మార్చినట్లు చెప్పారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే గురువారం రావాలని చెప్పిందని.. అక్కడికి వ్చచిన వాళ్లందరినీ గదిలో బంధించి దాడి చేయించిందని వాపోయారు. ఈ దాడిలో కమలమ్మ అనే బాధితురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితులకు తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.