Drugs: తెలంగాణలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్‌లోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

New Update
12000 crore rupees Drugs caught by Maharashtra Police in Telangana

12000 crore rupees Drugs caught by Maharashtra Police in Telangana

దేశంలోనే భారీ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ తెలంగాణలో వెలుగుచూసింది. హైదరాబాద్‌ సమీపంలోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఓ వీదేశీయుడితో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి 100 గ్రాముల మెఫెడ్రోన్, రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: తెలంగాణలో ఘోరం.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ - 2నెలల పసికందు కూడా

నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాఠే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబై పోలీసులు ఈ మూఠాలోకి తమ గూఢచారులను చొరబెట్టారు. వారాల తరబడి ప్రమాదకర ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత చివరికి ముఠా మూలాలను గుర్తించారు. ఈ క్రమంలోనే సరిగ్గా టైమ్ చూసి దాడి చేశారు. ఈ దాడిలో అత్యాధునిక రసాయన పరికరాలు, డ్రగ్‌ ఉత్పత్తి యూనిట్లను సీజ్‌ చేశారు. 32 వేల లీటర్లకు పైగా ప్రికర్సర్‌ కెమికల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.    

Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!

అయితే ఈ ఫ్యాక్టరీకి 'వాఘ్దేవి ల్యాబ్స్‌' అనే ఫేక్ పేరుతో లైసెన్స్‌ ఉంది. కానీ లోపల మాత్రం పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల తయారీ జరగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి చేసిన మెఫెడ్రోన్ డ్రగ్‌ను మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. 

Also Read: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతోంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద

ఇదిలాఉండగా ఇటీవల పోలీసులు గంజాయి, హషీష్ ఆయిల్, ఎల్ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలను కూడా పట్టుకున్నారు.ఈ కేసుల్లో ఐటీ నిపుణులు, విద్యార్థులు కూడా ఉన్నాకు. అలాగే కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. వివిధ యూనివర్సిటీలలోని విద్యార్థులు డ్రగ్స్ రవాణా, వినియోగంలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు