/rtv/media/media_files/2025/09/06/telangana-mother-killed-her-two-childrens-in-sangareddy-district-nizampet-2025-09-06-14-36-48.jpg)
Telangana Mother Killed her two Childrens in sangareddy district nizampet
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వ్యవహారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలను కొందరు కడతేర్చుతున్నారు. కుటుంబ పరువును మంటగలుపుతున్నారు. నిమిషాల సుఖం కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని హత్య చేయడానికి వెనుకాడటం లేదు. ఇంకొందరు తీవ్రమైన కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణంగా తమ పిల్లల్ని చంపి, ఆ తర్వాత వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విషాదకరమైన ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇలాంటిదే తాజాగా మరొక ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను కడతేర్చింది. ఇక్కడ కన్నీరు పెట్టించే మరో విషాదం ఏంటంటే.. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Mother Killed her two Childrens
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగమేశ్‌తో ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా.. హ్యాపీ జీవితాన్ని గడిపింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి మెలిసి బతికారు. ఈ ప్రేమ జంటను చూసి ఊర్లో వాళ్లంతా మురిసిపోయేవాళ్లు. ఆ సమయంలో వీరికి ఒక బిడ్డ జన్మించింది. అప్పటి నుంచి ఈ దంపతులు మరింత హ్యాపీగా ఉన్నారు.
అయితే ఈ మధ్య నుంచి వీరిలో కొన్ని కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది. కారణం ఏంటనేది ప్రస్తుతం తెలియనప్పటికీ ఈ జంట తరచూ గొడవలు పడుతున్నట్లు సమాచారం. అందులోనూ నెల క్రితమే సంగమేశ్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి సమయంలో ఆ పసికందుకు తల్లిదండ్రులు పక్కన తోడుగా నిలవాల్సింది పోయి.. గొడవలు పడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల అంటే సెప్టెంబర్ 4వ తేదీన సంగమేశ్ తన భార్యా పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం ఆ మరుసటి రోజే తల్లి, ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించడంతో అంతా తల్లడిల్లిపోయారు.
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడిఉన్న తల్లి బిడ్డలను పరిశీలించారు. అనంతరం తల్లే తమ పిల్లల గొంతు నులిమి చంపి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
కాగా ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. జగిత్యాల జిల్లాలో ఒక మహిళ తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించి.. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆ తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగూ బెంగళూరులో ఒక మహిళ తన భర్తకు అక్రమ సంబంధం ఉందని.. కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తన నాలుగు సంవత్సరాల కుమార్తెను చంపి తాను ఉరివేసుకుని చనిపోయింది. మరొక బెంగళూరు ఘటనలో.. ఒక మహిళ తన భర్తకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో పిల్లలు చనిపోగా, ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.