నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 35,655పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో నమోదు అయిన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉన్నాయి. వీటిలో ఏదొక స్థానం నుంచి మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో మిగిలిన రెండింటి కంటే అక్కడి నుంచి మొదటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
మధ్యాహ్నం 1గంటకల్లా రాష్ట్రంలోని అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. గత నెల 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 ఓట్లకు గానూ.. 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు వేశారు. బరిలో నిలిచిన 2290మంది అభ్యర్ధుల భవితవ్యం నేడు తేలనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 1766 టేబుల్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క సిగ్మెంట్ కు 14రౌండ్ల మేర లెక్కింపు జరుగుతుంది.
ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!