Scooter Offers: వారెవ్వా.. లీటర్‌కు 71 KM మైలేజీ.. యమహా స్కూటీ అదిరిపోయింది మచ్చా..!

Yamaha RayZR స్కూటర్ కు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇది ఈ ఏడాది 27,280 కొత్త స్కూటర్లను సేల్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. కేవలం రూ.80,875 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. ఇది లీటరుకు 71.33 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

New Update
yamaha rayzr best selling two wheeler

yamaha rayzr best selling two wheeler

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో టూ వీలర్లకు భారీ డిమాండ్ ఉంది. అందులోనూ వినియోగదారులు స్కూటీలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ట్రాఫిక్ సమయాల్లో ఇవి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అందువల్లే చాలా కంపెనీలు తరచూ కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసి ఆకట్టుకుంటున్నాయి. అందులో యమహా బ్రాండ్ ఒకటి. ఈ బ్రాండ్ గత కొన్నేళ్లుగా మార్కెట్‌ను శాసిస్తోంది. ఇటీవల ఈ కంపెనీలోని యమహా RayZR అత్యధికంగా సేల్‌ అయిన టూ వీలర్‌గా నిలిచింది. 

Also Read :  200MPతో బెస్ట్ కెమెరా ఫోన్లు.. రూ.30వేలలోపు లిస్ట్ చూసేయండి..!

Yamaha RayZR

గత నెలలో Yamaha RayZR  మొత్తం 27,280 మంది కొత్త కస్టమర్లను సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంఖ్య గత సంవత్సరంతో కంటే 64.91 శాతం పెరిగింది. ఇక దీని ధర విషయానికొస్తే.. Yamaha RayZR ని కేవలం రూ.80,875 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. ఈ స్కూటర్ మైలేజ్ అద్భుతంగా ఉంది. ఇది లీటరుకు 71.33 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. Yamaha RayZR స్కూటర్ ఫీచర్లలో 125cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.2 PS శక్తిని, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది మాత్రమే కాకుండా గత నెలలో యమహా FZ, Aerox అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. యమహా FZ గత నెలలో 16,137 మంది కొత్త కస్టమర్లను సంపాదించింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండవ వెహికల్‌గా నిలిచింది. ఇది గత ఏడాది అంటే 2024 సెప్టెంబర్‌లో 13,617 యూనిట్లను సేల్ చేసింది. ఇప్పుడు గతంతో పోలిస్తే 18.51 శాతం పెరిగింది. 

Yamaha MT15

Yamaha MT15 సెప్టెంబర్ 2025లో 11,695 యూనిట్లు అమ్ముడై జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ సంఖ్య సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 12,286 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 4 శాతం తగ్గుదలను సూచించింది. 

Also Read :  ఊరమాస్ డిస్కౌంట్.. Iphone 16పై రూ.16వేలకు పైగా తగ్గింపు..!

Yamaha R15

గత నెలలో Yamaha R15 బైక్స్ 9,329 యూనిట్లు అమ్ముడుపోవడంతో నాల్గవ స్థానంలో ఉంది. ఈ సంఖ్య 2024 సెప్టెంబర్‌లో అమ్ముడైన 10,614 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 12 శాతం తగ్గుదలను సూచిస్తుంది.

యమహా ఏరోక్స్

దేశంలోని అత్యంత శక్తివంతమైన స్కూటర్లలో ఒకటైన ఏరోక్స్ గత నెలలో 2,901 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. ఇది సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 2,142 యూనిట్లతో పోలిస్తే 35.43 శాతం పెరిగింది.

యమహా R03/MT03

జాబితాలో చివరిగా R03, MT03 ఉన్నాయి. వీటికి దాదాపు కస్టమర్లు లేరు. సెప్టెంబర్ 2025లో కంపెనీ ఈ రెండు మోడళ్లలో 10 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సంఖ్య సెప్టెంబర్ 2024లో 13 యూనిట్లుగా ఉంది.

యమహా ఫాసినో

ఈ జాబితాలో ఫాసినో ఐదవ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 5,955 మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమ్ముడైన 11,491 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 48 శాతం తగ్గింది.

Advertisment
తాజా కథనాలు