/rtv/media/media_files/2025/06/27/ads-in-status-2025-06-27-10-16-59.jpg)
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే వాట్సాప్ ప్రకటనలకు దూరంగా ఉంది. ఇప్పుడు వాట్సాప్ కొన్ని కొత్త మానిటైజేషన్ టూల్స్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఇవి ఛానెల్, స్టేటస్ సౌకర్యం అందుబాటులో ఉన్న అప్‌డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయట. పర్సనల్ కన్వర్జెషన్‌కు వాట్సాప్ ఉపయోగించే వారికి ఎలాంటి మార్పులు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త ఫీచర్లన్నీ ఆప్షనల్ అప్‌డేట్స్ విభాగానికి పరిమితం చేయనున్నట్లు సమాచారం. వినియోగదారుడు కోరుకుంటే సెట్టింగ్‌లలో వీటిని ఆఫ్ చేయవచ్చు. వాట్సాప్ ఇప్పుడు మూడు ప్రధాన మానిటైజేషన్ ఎంపికలను ప్రవేశపెట్టబోతోంది.
Also Read : జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట
WhatsApp New Feature
WhatsApp Launches Channel Subscriptions and Ads in Status, Keeping Your Chats Uninterrupted!
— WABetaInfo (@WABetaInfo) June 16, 2025
WhatsApp has expanded the Updates tab with new tools, including Channel Subscriptions, Promoted Channels, and Ads in Status.https://t.co/nG1qeG2PmA pic.twitter.com/noOVWplQIw
Also Read : 'మైసా' లుక్ లో భయపెడుతున్న రష్మిక ! పోస్టర్ అదిరిపోయింది
పెయిడ్ ఛానల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రమోట్ చేసిన ఛానెల్‌లు, స్టేటస్‌లో ప్రకటనలు. ఈ ఫీచర్లు అన్నీ డేటా గోప్యతను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల ఫోన్ నంబర్లను ఎప్పుడూ విక్రయించమని లేదా యాడ్స్ ఇచ్చే వారితో పంచుకోబోమని వాట్సాప్ హామీ ఇచ్చింది. అలాగే, ప్రైవేట్ మెస్సే్జ్, కాల్స్ లేదా గ్రూప్ సభ్యత్వాలు ప్రకటనలను లక్ష్యంగా చేసుకోమని చెప్పింది. వాట్సాప్ కు భారీ యూజర్ బేస్ ఉండటం వల్ల, మెటా ఈ దిశగా చర్యలు తీసుకోవడం అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్లను ఎప్పుడు ప్రారంభిస్తారనే డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే
Also Read : రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు
promotions | telugu tech news | latest-telugu-news | whatsapp-new-feature