/rtv/media/media_files/2025/09/15/iphone-15-price-dekha-kya-contest-2025-09-15-13-35-45.jpg)
iPhone 15 Price Dekha Kya Contest
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచే ఈ సేల్‌లోకి యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌లో IPhone లు సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా IPhone ల ధరలు గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది.
అయితే అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు, దుమ్ము దులిపే డీల్స్ మాత్రమే కాకుండా ఈ సారి కస్టమర్ల కోసం ఒక స్పెషల్ పోటీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోటీలో పాల్గొనే కస్టమర్లు IPhone 15ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. అయితే దానికి కొన్ని కండీషన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
iPhone 15 Price Dekha Kya Contest
అమెజాన్ ‘‘iPhone 15 Price Dekha Kya?’’ పేరుతో ఈ పోటీని ప్రారంభించింది. ఈ పోటీలో పాల్గొనే పద్ధతిని అమెజాన్ వివరించింది.
స్టిక్కర్‌లను కనుక్కోవాలి:
అమెజాన్ యాప్‌లోని మొబైల్స్ సెక్షన్‌లో ఐదు iPhone 15 స్టిక్కర్‌లను దాచారు. ఆ స్టిక్కర్‌లు ఒకేసారి దొరకవు. అందువల్ల వాటిని ప్రతిరోజూ యాప్‌లోకి వెళ్లి వెతికి కనుక్కోవాలి.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయాలి:
మీరు ఆ ఐదు స్టిక్కర్‌లను కనుక్కున్న తర్వాత.. వాటి స్క్రీన్‌షాట్ తీసి మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసేటప్పుడు @amazonmobilesin అనే అకౌంట్‌ను ట్యాగ్ చేయాలి. అప్పుడే #iPhone15PriceDekhaKya, #AmazonGreatIndianSale అనే హ్యాష్‌ట్యాగ్‌లను తప్పకుండా ఉపయోగించాలి.
విష్‌లిస్ట్‌లో చేర్చాలి:
ఈ పోటీలో పాల్గొనేవారు అమెజాన్ యాప్‌లో iPhone 15ను తప్పనిసరిగా మీ విష్‌లిస్ట్‌లో చేర్చాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఒకవేళ విష్‌లిస్ట్‌లో చేర్చకపోతే.. స్టిక్కర్లను కనిపెట్టి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసినా మీ ఎంట్రీ చెల్లదని గమనించాలి.
ఈ మూడు దశలు పూర్తయితేనే మీరు పోటీలో పాల్గొనడానికి అర్హులు అవుతారు.
ఈ పోటీ సెప్టెంబర్ 25 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది.
ఇందులో పాల్గొనడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ పోటీలో పాల్గొనే వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి.
ప్రతి వ్యక్తి ఇందులో ఒక్కసారి మాత్రమే పాల్గొనడానికి వీలుంటుంది.
పోటీ ముగిసిన తర్వాత 5 మంది విజేతలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి, వారిని అమెజాన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రకటిస్తారు. అప్పుడే బహుమతిగా iPhone 15ను ఇస్తారు.