/rtv/media/media_files/2025/06/05/khCq7SFOBwIUE6HjTCSS.jpg)
June 2025 Mobiles
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే జూన్ 2025 లో అదిరిపోయే ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ నెలలో OnePlus, Vivo, Poco వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో Vivo T4 Ultra, OnePlus Nord CE 5, Poco F7 ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
Vivo T4 Ultra
కంపెనీ జూన్ 11న భారతదేశంలో Vivo T4 అల్ట్రాను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ Vivo T-సిరీస్‌లో పెద్ద అప్‌గ్రేడ్ అవుతుందని కంపెనీ భావిస్తుంది. ఇది మెరుగైన కెమెరా సెటప్, pOLED డిస్ప్లే, కొత్త మిడ్-రేంజ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, 90W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఇది Dimensity 9300 సిరీస్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 50MP Sony IMX921తో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
Poco F7
పోకో ఎఫ్7 ఫోన్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జూన్ లోపు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పోకో ఎఫ్7 స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 లేదా మరింత శక్తివంతమైన మిడ్-రేంజ్ మొబైల్ అని భావిస్తున్నారు. ఇందులో 120Hz OLED డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. దీని అతిపెద్ద ఫీచర్.. దీనిలో ఉన్న భారీ 7550mAh బ్యాటరీ.
OnePlus Nord CE 5
OnePlus ఈ నెలలో దాని బడ్జెట్ ఫ్రెండ్లీ లైనప్‌లో Nord CE 5ని విడుదల చేయబోతోంది. దీని లాంచ్ తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ.. లీక్‌ల ప్రకారం, జూన్ చివరి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనిలో MediaTek Dimensity 8350 చిప్సెట్, 50MP కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. 7,100mAh బ్యాటరీ దాని అతిపెద్ద ఫీచర్లలో ఒకటిగా కంపెనీ చెబుతోంది.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు