/rtv/media/media_files/JmJ7fhAzlVbHCr23Xx7M.jpg)
ఈ ఏడాదిలో ఇప్పటికి ఏడు నెలలు పూర్తయ్యాయి. ఈ 7 నెలల్లో పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేసి గుర్తింపు సంపాదించుకున్నాయి. ఇక రాబోయే మిగతా నెలల్లో కూడా అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. AI-ఆధారిత అప్‌గ్రేడ్‌లు, కొత్త డిజైన్ లాంగ్వేజ్, శక్తివంతమైన బ్యాటరీ లైఫ్‌ను అందించే అనేక స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి.
అందులో Google Pixel 10 సిరీస్, Oppo K13 Turbo, Vivo Y400 5G, Redmi 15 5G, Lava Agni 4 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ జాబితాలో ఫ్లాగ్‌షిప్, విలువైన పరికరాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు వాటి స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : సెల్‌ఫోన్ పోతే పరేషాన్ కావొద్దు! ఎందుకో మీరే చూడండి
2025 లో భారతదేశంలో రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉన్నట్లు సమాచారం. - పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫోన్లు ఉన్నాయి. ఈసారి కంపెనీ టెన్సర్ G5 చిప్‌సెట్‌ను తీసుకువస్తుంది. దీనిని గూగుల్ స్వయంగా డెవలప్ చేస్తుంది. పిక్సెల్ 10 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల QHD + OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ, 48MP అల్ట్రా-వైడ్, 48MP పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 42MP సెల్ఫీ కెమెరా అందించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. AI నోట్ సమ్మరీ, సర్కిల్ టు సెర్చ్ వంటి ప్రీమియం AI ఫీచర్లతో వస్తుందని సమాచారం.
ఒప్పో K13 టర్బో సిరీస్ 5G
Oppo ఈసారి దాని K-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గేమింగ్, పనితీరు కోసం పని చేస్తోంది . Oppo K13 Turbo, K13 Turbo Pro ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో వస్తాయని సమాచారం. వనిల్లా K13 Turbo ఫోన్ MediaTek Dimensity 8450 SoCని పొందే అవకాశం ఉంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మద్దతుతో 6.8 అంగుళాల AMOLEDతో వచ్చే ఛాన్స్ ఉంది. మరో పెద్ద విషయం ఏంటంటే ఈ ఫోన్‌లు ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్, గేమింగ్-గ్రేడ్ వైబ్రేషన్ మోటారును పొందుతాయని లీక్‌లు చెబుతున్నాయి. ఇవి 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అమర్చబడి ఉంటాయని భావిస్తున్నారు.
వివో Y400 5G
Vivo Y400 5G అనేది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీనికి స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ లభిస్తుందని వెల్లడించారు. డిస్ప్లే 6.67‑అంగుళాల FHD+ AMOLEDతో రావచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఆరా లైట్ ఫ్లాష్‌తో 50MP సోనీ IMX852 ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో సెకండరీ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉండవచ్చు. ఫోన్ IP68, IP69 డస్ట్/వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో రావచ్చు. బ్యాటరీ 6000mAh బ్యాటరీ ప్యాకప్ పొందుతుంది..ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Also Read : తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
రెడ్‌మి 15 5G
Redmi 15 5G విషయానికొస్తే.. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 చిప్‌సెట్‌తో రావచ్చని చెబుతున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9‑అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్. అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ 7000mAh ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత HyperOSలో పనిచేస్తుందని భావిస్తున్నారు.
లావా అగ్ని 4
లావా తన తదుపరి అగ్ని సిరీస్ ఫోన్ లావా అగ్ని 4 ను ఈ నెలలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
tech-news-telugu | telugu tech news | upcoming-smartphones | latest-telugu-news | telugu-news | latest technology news in telugu