Ulefone Armor X32: మూడు తెప్పించే ముచ్చటైన ఫోన్.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ - కెమెరా హైక్లాస్!

ఉలేఫోన్‌ తాజాగా Ulefone Armor X32 ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.11,000గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, AliExpress, Ozon ద్వారా కొనుక్కోవచ్చు. 48MP ప్రధాన కెమెరా, 20MP నైట్ విజన్ కెమెరాతో వస్తుంది. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

New Update
Ulefone Armor X32

Ulefone Armor X32

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఉలేఫోన్‌కు మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది రాక్-స్ట్రాంగ్, రఫ్-టఫ్ ఫోన్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ తాజాగా మరో చౌకైన ఫోన్‌ను విడుదల చేసింది. Ulefone Armor X32 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. 

ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

Ulefone Armor X32 Price

Ulefone Armor X32 ధర విషయానికొస్తే.. ఇది USలో $129.99 (దాదాపు రూ. 11,000) ధరతో రిలీజ్ అయింది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు AliExpress, Ozon వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. 

ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

Ulefone Armor X32 Specifications

Ulefone Armor X32 ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 5.65-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కంపెనీ దీనికి మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్ ఇచ్చింది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌లో IP68 - IP69K రేటింగ్‌లను అందించారు. ఈ ఫోన్ రెండు సిమ్ కార్డులతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో పనిచేస్తుంది. భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు మద్దతు ఇస్తుంది.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

ప్రాసెసింగ్ కోసం ఆర్మర్ X32 మీడియాటెక్ హీలియో G91 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో కంపెనీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించింది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 48MP ప్రధాన కెమెరా ఉంది. అలాగే 20MP నైట్ విజన్ కెమెరాను అందించారు. ఇది చీకటిలో కూడా స్పష్టంగా ఫొటోలు తీస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

latest-telugu-news | telugu-news | mobile-offers

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు