Baba Ramdev: ట్రంప్‌ టారిఫ్‌లపై.. బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానాలపై యోగా గురు, పతంజలి కో ఫౌండర్ బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఇది ఒక రకమైన 'ఆర్థిక ఉగ్రవాదం' అని విమర్శించారు.

New Update
Baba Ramdev

Baba Ramdev

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనుసరిస్తున్న టారిఫ్‌(donald trump tariffs)ల విధానాలపై యోగా గురు, పతంజలి కో ఫౌండర్ బాబా రాందేవ్(baba-ramdev) సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఇది ఒక రకమైన 'ఆర్థిక ఉగ్రవాదం' అని విమర్శించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాందేవ్ బాబా విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ విధానాలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరించేలా, వారిపై ఒత్తిడి తెచ్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Also Read :  దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు

Baba Ramdev Says About Trump Tariff Policy

"మేము రాజకీయ, ఆర్థిక వలసవాదాన్ని చూశాం. ఇప్పుడు మేధో వలసవాదం అనే కొత్త దశను చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన 'టారిఫ్ టెర్రరిజం'(economic terrorism)లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. పేద దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలను భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు."

Also Read :  ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5  రాకెట్ ప్రయోగం

ట్రంప్ ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను పట్టించుకోవడం లేదని, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి వాటిని తన ఇష్టానుసారం నడుపుతున్నారని బాబా రాందేవ్ విమర్శించారు. ఆయన డాలర్ విలువను పెంచి, ఇతర దేశాల కరెన్సీల విలువను తగ్గిస్తున్నారని, ఇది ఒక రకమైన ఆర్థిక ఉగ్రవాదమేనని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ ఒక అభివృద్ధి చెందిన, శక్తివంతమైన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాబా రాందేవ్ నొక్కి చెప్పారు. "భారతీయులంతా ఏకమై ఒక శక్తిమంతమైన దేశాన్ని నిర్మించాలి. తద్వారా ఇలాంటి విధ్వంసక శక్తులకు గట్టి జవాబివ్వాలి" అని ఆయన పిలుపునిచ్చారు. స్వదేశీ పరిశ్రమలను బలోపేతం చేసుకోవడం, స్వావలంబన సాధించడమే ఇటువంటి ప్రపంచ సవాళ్లకు సరైన పరిష్కారమని ఆయన సూచించారు.

Advertisment
తాజా కథనాలు