Self Driving Auto: ఆహా ఓహో.. సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో వచ్చేసింది మచ్చా.. ఎంత మైలేజ్ ఇస్తుందంటే?

భారతీయ EV తయారీదారు ఒమేగా సెయికి మొబిలిటీ 'స్వయం గతి' పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటోను ప్రారంభించింది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ.4 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. దీనికి LiDAR, GPS వంటి AI-ఆధారిత సాంకేతికత ఉంది.

New Update
swayamgati self driving autonomous electric auto

swayamgati self driving autonomous electric auto

ప్రముఖ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ కంపెనీ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) భారత దేశంలో మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా (Self driving autonomous electric auto)ను లాంచ్ చేసింది. కంపెనీ దీనికి ‘ఆటోమేటిక్’ అని పేరు పెట్టింది. సాంప్రదాయ ఆటో డిజైన్‌ను కలిగి ఉన్న ఈ ఆటో-రిక్షా రెండు వెర్షన్లలో లభిస్తుంది. అందులో ప్యాసింజర్ వెర్షన్ ధర దాదాపుగా రూ.4 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. అలాగే కార్గో వెర్షన్ ధర రూ.4.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా.. డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 

Also Read :  బెస్ట్ వాషింగ్ మెషీన్లు.. కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. వీటిని అస్సలు వదలొద్దు

Self- Driving Auto Specs

Automatic Self- Driving Auto స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 10.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 120 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఈ వెహికల్ భారతీయ రోడ్లు, ట్రాఫిక్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అందువల్ల ఇది 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ఈ వెహికల్ అధునాతన ఇంజన్‌ను కలిగి ఉంది. ప్రత్యేకంగా తక్కువ-వేగం, అధిక-సాంద్రత గల ట్రాఫిక్ ప్రాంతాల కోసం దీనిని రూపొందించారు.

ఈ ఆటో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే కాదు.. AI-ఆధారిత వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది లిడార్ టెక్నాలజీతో వస్తుంది. GPS, మళ్టీ-సెన్సార్ నావిగేషన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా రిమోట్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కాగా ఫేజ్ 1 ట్రయల్స్‌లో.. ఈ ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో ఏడు స్టాప్‌లతో 3 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేసింది. ఇది ప్రత్యక్ష అడ్డంకిని గుర్తించింది. అదే సమయంలో ప్రయాణీకుల భద్రతను ప్రదర్శించింది. 

కంపెనీ ఇప్పుడు 2వ దశలోకి అడుగుపెడుతోంది. ఇందులో కంట్రోల్‌డ్ ట్రేడ్ కార్యకలాపాలు ఉంటాయి. ఈ సెల్ఫ్ ఎలక్ట్రిక్ ఆటో వాహనాలు త్వరలో విమానాశ్రయాలు, టెక్ పార్కులు, పారిశ్రామిక కేంద్రాలు, గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ సిటీలలో తిరుగుతాయని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే రెండేళ్లలో 1,500 అటానమస్ ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేయనున్నట్లు OSM ప్రకటించింది. కంపెనీ చైర్మన్ ఉదయ్ నారంగ్ ఈ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఇది కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదని.. ఇది భారతీయ రవాణా భవిష్యత్తు అని తెలిపారు. తాము ప్రపంచాన్ని అనుసరించడం లేదని అన్నారు. ఈ వాహనం AI, LiDAR, అటానమస్టెక్నాలజీ వంటి హైటెక్ టెక్నాలజీలను ఇప్పుడు భారతదేశంలో తయారు చేయవచ్చని తెలిపారు.

Also Read :  కొత్త ఫోన్ భలే భలే.. రియల్‌మీ పిచ్చెక్కించింది బ్రో - ఫీచర్లు హైక్లాస్..!

Advertisment
తాజా కథనాలు