Washing Machine Offers: బెస్ట్ వాషింగ్ మెషీన్లు.. కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. వీటిని అస్సలు వదలొద్దు

అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మే టెక్ లైఫ్ వాషింగ్ మెషిన్ రూ.12,870, గోద్రేజ్ వాషింగ్ మెషిన్ రూ.13,499, వోల్టాస్ బెకో వాషింగ్ మెషిన్ రూ.12,390, వర్ల్పూల్ 7K వాషింగ్ మెషిన్ రూ.15,000గా కొనుక్కోవచ్చు.

New Update
Washing Machine Offers (2)

Washing Machine Offers

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో బడా సేల్ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో అనేక ప్రొడెక్టులపై భారీ ఆఫర్‌లు, డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వాషింగ్ మెషీన్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో గోద్రేజ్, శామ్‌సంగ్, హైయర్, వెర్సూల్‌తో సహా అనేక టాప్-లోడెడ్ వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ BEE 5-స్టార్ రేటింగ్‌తో వస్తాయి. ఈ సేల్ సమయంలో రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న టాప్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Washing Machine Offers

రియల్‌మే టెక్ లైఫ్ వాషింగ్ మెషిన్

రియల్‌మీ టెక్ లైఫ్ 8KG టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,870గా ఉంది. ఇది 7000rpm గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. దీనికి 5-స్టార్ రేటింగ్ అందించారు. 

గోద్రేజ్ వాషింగ్ మెషిన్ 

గోద్రేజ్ టాప్-లోడెడ్ వాషింగ్ మెషీన్ ఈ సేల్ సమయంలో తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ.13,499లకే పొందొచ్చు. ఇతర వాషింగ్ మెషీన్ల కంటే ఇది 60 శాతం వేగాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ మెషీన్ కూడా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. 

Also Read :  ఇది కదా అసలైన పండుగంటే.. అక్టోబర్‌లో ఏకంగా 19 రోజులు బ్యాంకులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

వోల్టాస్ బెకో వాషింగ్ మెషిన్ 

వోల్టాస్ బెకోలో 6.5 కిలోల సామర్థ్యం కలిగిన టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్ ఉంది. ఇది 5-స్టార్ రేటింగ్ పొందిన వాషింగ్ మెషీన్. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,390గా నిర్ణయించబడింది. 

వర్ల్పూల్ 7K వాషింగ్ మెషిన్ 

వర్ల్‌పూల్ పూర్తిగా ఆటోమేటిక్ టాప్-లోడింగ్‌తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ హార్డ్ వాటర్‌లో కూడా దుస్తులను సురక్షితంగా ఉంచుతుందని కంపెనీ పేర్కొంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000గా ఉంది. ఇది 7 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్లు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటాయి. 

ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ మోడల్స్

LG 7.5 Kg (5 Star)

LG 7.5 Kg (5 Star) స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. టర్బోడ్రమ్ (TurboDrum) టెక్నాలజీతో లభిస్తుంది. దీనిని రూ. 17,990లకు సొంతం చేసుకోవచ్చు. రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉండవచ్చు. ఇది చిన్న, మధ్య తరహా కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది.

Also Read :  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. దసరా వేళ వినియోగదారులకు బిగ్ షాక్!

ఫ్రంట్ లోడ్ మోడల్స్

Samsung 7 Kg (5 Star)

Samsung 7 Kg (5 Star) వాషింగ్ మెషీన్ AI కంట్రోల్ ప్యానెల్, హైజీన్ స్టీమ్ ఫీచర్, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌తో వస్తుంది. దీనిపై 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుంది. ఎకో బబుల్ టెక్నాలజీ తక్కువ ఉష్ణోగ్రతలో కూడా అద్భుతమైన క్లీనింగ్‌ను అందిస్తుంది. దీనిని రూ.25,990లకు సొంతం చేసుకోవచ్చు.

IFB 6.5 Kg

IFB 6.5 Kg యాక్వా ఎనర్జీ (Aqua Energie) ఫీచర్‌తో వస్తుంది. ఇది నీటిని శుభ్రం చేసి, డిటర్జెంట్ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. 4D వాష్ సిస్టమ్, క్రెసెంట్ మూన్ డ్రమ్ ఫీచర్లు బట్టల నాణ్యతను కాపాడుతాయి. దీనిని రూ.22,990లకు కొనుక్కోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు