New Smartphone: శామ్‌సంగ్ నుంచి సూపర్ ఫోన్.. బడ్జెట్ ధరలో వచ్చేస్తుంది!

శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ రేపు భారతదేశంలో విడుదల కానుంది. దీని ధర రూ.20,000 లోపే ఉంటుంది. ఈ ఫోన్‌లో 50MP OIS కెమెరా, AI ఫీచర్లు, 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, Exynos 1380 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఉండనున్నాయి.

New Update
samsung galaxy f36 5g

samsung galaxy f36 5g

ప్రముఖ టెక్ బ్రాండ్ శామ్సంగ్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరొక మొబైల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో Samsung Galaxy F36 5G మొబైల్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Samsung Galaxy F36 5G launch date

ఇది రెడ్, ఊదా రంగులతో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు దాని లాంచ్ తేదీ, భారతదేశంలో అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం. Samsung Galaxy F36 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలై 19 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. Samsung Galaxy F36 5G లాంచ్‌కు ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నందున మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.  

Samsung Galaxy F36 5G Price

Samsung Galaxy F36 5G మొబైల్ ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. గత నెలలో Galaxy M36 5G భారతదేశంలో రూ. 17,499 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు Samsung Galaxy F36 5G కూడా అదే ధరకు రిలీజ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 19న లాంచ్ అయిన తర్వాత ఇది సేల్‌కి వచ్చే అవకాశం ఉంది. Samsung Galaxy F36 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. అలాగే Samsung ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చు. 

Samsung Galaxy F36 5G Specifications

Samsung Galaxy F36 5G అధునాతన కృత్రిమ మేధస్సు (AI)తో వస్తుంది. రెండు షేడ్స్ లెదర్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటాయి. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. 

ఇది కూడా చూడండి:పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు