/rtv/media/media_files/2025/07/17/man-chewed-snake-in-banda-uttar-pradesh-2025-07-17-14-05-09.jpg)
man chewed snake in banda uttar pradesh
పాము కాటుకు గురైన ఘటనలు తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ 35 ఏళ్ల అశోక్ అనే వ్యక్తి మద్యం మత్తులో బతికున్న ఒక పామును కొరికి మింగేశాడు. ఈ షాకింగ్ దృశ్యం చూసిన అతడి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అతన్ని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Man Chewed Snake
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అశోక్ మద్యం సేవించి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అతడికి ఒక పాము కనిపించింది. తాగిన మైకంలో ఉన్న అశోక్ ఆ పామును పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికాడు. అప్పుడే అశోక్ తల్లి సియా దుల్హారి భయంతో కేకలు వేసింది. అనంతరం ఆమె వెంటనే వెళ్లి కొడుకు నోట్లో నుంచి పామును బయటకు తీసింది.
उत्तर प्रदेश के बाँदा जिले के बबेरू कोतवाली क्षेत्र के हरदौली गांव में एक हैरान कर देने वाली घटना सामने आई है। मंगलवार देर शाम एक युवक अशोक कुमार (उम्र 35 वर्ष) ने शराब के नशे में एक ज़हरीले सांप को मारकर खाने की कोशिश की। जब सांप का आधा हिस्सा उसके मुंह में जा चुका था, तभी… pic.twitter.com/6oey1GEdGB
— Benaras Global Times (@benarasGlobal) July 16, 2025
ఇది కూడా చూడండి: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
అయితే అప్పటికే అశోక్ రెండు మూడు ముక్కలను మింగేశాడు. వెంటనే అశోక్‌ను బాబేరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా దీనిని చూసి ఆశ్చర్యపోయారు. ఆపై అశోక్‌కు ట్రీట్మెంట్ అందించారు.
#बांदा : बबेरू कोतवाली क्षेत्र के हरदौली गांव में एक शराबी ने नशे की हालत में मरे हुए सांप को निगल लिया। परिजनों ने जब देखा तो आधा सांप उसके मुंह से बाहर निकाला, जबकि आधा वह पहले ही निगल चुका था। व्यक्ति को तुरंत सामुदायिक स्वास्थ्य केंद्र में भर्ती कराया गया, जहां उसका प्राथमिक… pic.twitter.com/6OBG3GyyvU
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) July 17, 2025
ఇది కూడా చూడండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సకాలంలో అశోక్‌ను ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. పాము విషపూరితమైనదైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి నిలకడగా ఉందని, అతనికి యాంటీ వెనమ్, ఇతర అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు.
ఈ వింత ఘటన బాబేరు కొత్వాలి ప్రాంతంలోని హర్దౌలి గ్రామంలో సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో మనిషి ఎంత దూరం వెళ్లగలడో ఈ సంఘటన నిరూపించిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !