Realme GT 7 - Realme GT 7T: రియల్‌మి జీటీ సిరీస్ సేల్ ప్రారంభం.. ఆఫర్లు అదిరిపోయాయ్ గురూ!

రియల్‌మీ జీటీ7, జీటీ 7టీ ఫోన్ల సేల్ భారతదేశంలో ప్రారంభమైంది. అఫీషియల్ వెబ్‌సైట్, Amazon ద్వారా కొనుక్కోవచ్చు. మొదటి సేల్‌లో రూ.3 వేల వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

New Update
Realme GT 7 and Realme GT 7T sale

Realme GT 7 and Realme GT 7T sale

Realme GT 7, Realme GT 7T స్మార్ట్‌ఫోన్ల సేల్ భారతదేశంలో ప్రారంభమైంది. Realme GT 7 ఫోన్ MediaTek Dimensity 9400e చిప్‌సెట్‌పై నడుస్తుంది. అదే సమయంలో Realme GT 7Tఫోన్ MediaTek Dimensity 8400-Max చిప్‌సెట్‌తో వస్తుంది. ఇవి రెండూ 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. Realme GT 7 మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 

Realme GT 7 Price and Offers

Realme GT 7, Realme GT 7T ఫోన్లను ప్రస్తుతం Realme ఇండియా వెబ్‌సైట్, Amazon ద్వారా కొనుక్కోవచ్చు.

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది.

12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 42,999.

12GB + 512GB వేరియంట్ ధర రూ. 46,999గా నిర్ణయించారు.

ఇది బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఉంది. పాత మొబైల్ మార్చుకుంటే వినియోగదారులు రూ. 3,000 విలువైన తక్షణ తగ్గింపును పొందవచ్చు. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

Realme GT 7T Price And Offers

8GB RAM + 256GB మోడల్ ధర రూ. 34,999గా ఉంది. 

12GB+256GB మోడల్ ధర రూ.37,999. 

12GB+512GB RAM ధర రూ. 41,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు Realme రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్‌లను, రూ. 6,000 వరకు (ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్) అందిస్తోంది. అలాగే కొనుగోలుదారులు తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్ EMIలను పొందవచ్చు. నో-కాస్ట్ EMIలు రూ. 4,444 నుండి ప్రారంభమవుతాయి. 

Realme GT 7, Realme GT 7T Specifications

Realme GT 7, GT 7T రెండూ Android 15-ఆధారిత Realme UI 6.0 తో వస్తాయి. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. నాలుగు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటాయి. 

Realme GT 7 లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX906 సెన్సార్, 50-మెగాపిక్సెల్ S5KJN5 టెలిఫోటో కెమెరా. 8-మెగాపిక్సెల్ OV08D10 అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అదే సమయంలో Realme GT 7T లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

 

tech-news | mobile-offers | telugu tech news | Realme GT series

Advertisment
Advertisment
తాజా కథనాలు