Poco M6 Plus 5G: వర్త్ వర్మ వర్త్.. 108MP కెమెరా 5జీ ఫోన్ ధర ఇంత తక్కువా.. వెంటనే కొనాయాల్సిందే!

Poco M6 Plus 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. 6జీబీ/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.9,999లకే కొనుక్కోవచ్చు. వెనుకవైపు 108MP, 2MP కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.

New Update
Poco M6 Plus 5G

Poco M6 Plus 5G

చాలా మంది ఫోన్ ప్రియులు కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫొటో క్లారిటీ గల మొబైల్‌నే మొదటిగా ఎంచుకుంటారు. తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ గల కెమెరా ఫోన్ కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటారు. మరి మీరు కూడా అలాంటి ఫోన్ కోసమే చూస్తున్నట్లయితే ఇదే మీకు సరైన అవకాశం. Poco M6 Plus 5G ఫోన్ మంచి ఆప్షన్‌గా ఉంది. ఈ ఫోన్ ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇప్పుడిది ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ధర తగ్గింపుతో పాటు, కస్టమర్లు బ్యాంక్ ఆఫర్ల నుండి అదనపు డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. అది మాత్రమే కాకుండా పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చూడండి: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

Poco M6 Plus 5G Offers

Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఈ ఫోన్ గత ఏడాది ఆగస్టులో రూ.12,999కి లాంచ్ అయింది. ఇప్పుడు రూ.9,999లకి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అంటే రూ.3,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది కాకుండా పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 6,800 వరకు తగ్గించవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని పొందవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. 

ఇది కూడా చూడండి:రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

Poco M6 Plus 5G Specifications

Poco M6 Plus 5G ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌పై పనిచేస్తుంది. 

ఇది కూడా చూడండి:రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

కెమెరా విషయానికొస్తే.. M6 ప్లస్ 5G వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం.. ఇది 5G Wi-Fi, బ్లూటూత్ 5.0, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్ C పోర్ట్‌లను కలిగి ఉంది. 

ఇది కూడా చూడండి: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO

latest-telugu-news | telugu-news | POCO MOBILE | new-mobile

Advertisment
Advertisment
తాజా కథనాలు